MLA Mallareddy | మేడ్చల్ రూరల్, ఫిబ్రవరి 11: తెలంగాణ తొలి సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చేసిన ఆలోచన మేరకు దేశంలోనే మొదటిసారి ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటు చేశామని మేడ్చల్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి తెలిపారు. మేడ్చల్ మండలంలోని పూడూర్ గ్రామంలో రూ. 4.70 కోట్లతో నూతనంగా నిర్మించిన ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్‌ను ఎమ్మెల్యే ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతులు రాజులు కావాలనే ఉద్దేశ్యంతో రాష్ర్టంలో కేసీఆర్ చేసిన పనులు ఆదర్శంగా నిలిచాయన్నారు. కూరగాయల సాగు చేసే రైతులకు ఉపయోగపడేందుకు మల్కాజ్గిరి ఎమ్మేల్యే రాజశేఖర్‌రెడ్డి గతంలో కృషి చేసి ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటుకు నిధులు మంజూరీ చేయించేందుకు పాటుపడ్డాడని తెలిపారు. ఈ యూనిట్ కూరగాయల రైతులకు ఉపయోగకరంగా ఉంటుందని తెలిపారు. ఇందులో కూరగాయలను ప్రాసెస్ చేయడంతో పాటు ప్యాకింగ్ చేసి ఇతర ప్రాంతాలకు తరలించి అధిక ధరలకు అమ్ముకునే అవకాశం ఉంటుందని, అదే విదంగా టమాట సాస్ తయారు చేసుకుని రైతులు అధిక లాభాన్ని పొందడానికి వీలుంటుందని అన్నారు.
ఈ కార్యక్రమంలో డీసీఎంఎస్ వైస్ చైర్మన్ మధూకర్‌రెడ్డి, పూడూర్ సొసైటీ చైర్మన్ సుధాకర్‌రెడ్డి, మేడ్చల్ పీఏసీఎస్ చైర్మన్ రణదీప్‌రెడ్డి, మాజీ సర్పంచ్ బాబు యాదవ్, నాయకులు నర్సింహరెడ్డి, నాగరాజు, సొసైటీ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.