ఘట్కేసర్,నవంబర్6 : బీసీలను(BCs) అన్ని విధాలుగా ఆదరించించి అక్కున చేర్చుకుంది బీఆర్ఎస్ పార్టీ మాత్రమేనని మేడ్చల్ ఎమ్మేల్యే చామకూర మల్లారెడ్డి(MLA Mallareddy )అన్నారు. ప్రభుత్వం చేపట్టిన సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే కార్యక్రమాన్ని బుధవారం ఘట్కేసర్ ఎంపీడీవో కార్యాలయంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా మల్లారెడ్డి మాట్లాడుతూ..ఓట్లు బీసీలవి పాలించేది మాత్రం ఓసీలు పేర్కొన్నారు. బీసీలకు ఇప్పటికైనా న్యాయం జరుగాలని స్పష్టం చేశారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం బీసీల కుల వృత్తులను ప్రోత్సహించి ఆర్థికంగా ఆదుకుందన్నారు. జనాభలో 50శాతం ఉన్న బీసీలను ధనవంతులుగా చేయాలన్నారు.
ఇవి కూడా చదవండి..
KTR | నువ్వు ఎప్పుడు జైలుకు పోతావో చూస్కో.. మంత్రి పొంగులేటికి కేటీఆర్ వార్నింగ్