వెంగళరావునగర్, మే 18 : జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని పార్కుల అభివృద్ధికి కృషి చేస్తానని జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అన్నారు. ఆదివారం వెంగళరావునగర్ డివిజన్ సిద్దార్ధనగర్ లో రూ.30 లక్షల వ్యయంతో చేపట్టిన పార్కు పునర్నిర్మాణ పనులకు ఆయన శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాగంటి మాట్లాడుతూ పార్కు అభివృద్ధికి నిధులు మంజూరు చేశామని పేర్కొన్నారు. కాలనీ వాసులు ఆహ్లాదకరమైన వాతావరణంలో గడిపేలా పార్కును సుందరంగా తీర్చిదిద్దుతామని చెప్పారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పోరేటర్ దేదీప్య విజయ్, ఏ.ఈ అవినాష్, వర్క్ ఇన్స్పెక్టర్ శేఖర్ డివిజన్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.