కేపీహెచ్బీ కాలనీ, నవంబర్ 6 : దొంగ హమీలతో గద్గెనెక్కిన కాంగ్రెస్ పాలకులకు కనువిప్పు కలగాలంటే.. బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మాగంటి సునీతాగోపినాథ్ను గెలిపించాలని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. గురువారం జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని ఎర్రగడ్డ డివిజన్లో బీఆర్ఎస్ నేతలతో కలసి ఇంటింటికి తిరిగి కారు గుర్తుకు ఓటేయ్యాలని కోరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. మాగంటి గోపినాథ్ల హాయంలో జూబ్లీహిల్స్ నియోజకవర్గం అన్ని రంగాలలో అభివృద్ధిని సాధించిందని, పేదలందరికి సంక్షేమ ఫలాలు అందాయన్నారు.
అబద్ధపు హమీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి రెండేళ్లు గడిచిన ప్రజలకు ఒక్క మంచి పని చేయలేదని, అభివృద్ధి కోసం ఒక్క రూపాయి ఖర్చు పెట్టలేదన్ననారు. ప్రజా వ్యతిరేక విధానాలతో విధ్వంసాన్ని చేస్తున్న కాంగ్రెస్కు బుద్ధి చేప్పాలంటే… ప్రజలందరూ ఆలోచించి కారు గుర్తుకు ఓటేయ్యాలని పిలుపునిచ్చారు. ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీపై యావత్ ప్రజలందరికి మంచి నమ్మకం ఉందని, ఎన్నికలలో భారీ మోజార్టీతో గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు రాగిడి లక్ష్మారెడ్డి, తదితరులు ఉన్నారు.