కేపీహెచ్బీ కాలనీ, అక్టోబర్ 3 : విజ్ఞాన్పూరి కాలనీలో రోడ్డు పనులను( Road works) వేగవంతం చేయాలని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు(MLA Madhavaram) అన్నారు. గురువారం కాలనీలో నూతనంగా చేపట్టిన రోడ్డు మరమ్మతు పనులను అధికారులతో కలిసి ఎమ్మెల్యే, కార్పొరేటర్లు పరిశీలించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ..కాలనీలో ప్రజల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని పనులను త్వరగా పూర్తిచేయాలని, రోడ్డు పనులలో నాణ్యతాప్రమాణాలను పాటించాలని అధికారులను ఆదేశించారు.ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ జూపల్లి సత్యనారాయణ, ఈఈ గోవర్ధన్, స్థానిక నేతలు సంతోష్, ప్రభాకర్, కాలనీ వాసులు ఉన్నారు.
సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ..
సీఎం రిలీఫ్ ఫండ్ కష్టాలలో ఉన్న పేదలకు వరంలాంటిదని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. గురువారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో 39 మంది లబ్ధిదారులకు రూ.16,94,500ల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేశారు. ఆనారోగ్యంతో వైద్యశాలలో చేరిన వారికి వైద్యశాల ఖర్చుల కోసం ప్రభుత్వం నుంచి సాయం అందుతుందన్నారు. కష్టకాలంలో పేదలకు ఈ సాయం ఎంతగానో ఉపయోగప డుతుందన్నారు.ఈ కార్యక్రమంలో స్థానిక బీఆర్ఎస్ పార్టీ నేతలు ఉన్నారు.