కేపీహెచ్‌బీ కాలనీ, అక్టోబర్ 24 : కేసీఆర్ నాయకత్వంలో జరిగిన అభివృద్ధిని చూసి.. బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మాగంటి సునీతను ఆదరించాలని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. శుక్రవారం జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని ఎర్రగడ్డ డివిజన్ రాజీవ్‌నగర్ కాలనీలో ఇంటింటికి ప్రచారంలో కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, బీఆర్ఎస్ పార్టీ నాయకుడు వంటేరు ప్రతాప్‌రెడ్డి, మాజీ కార్పొరేటర్ బాబురావులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో నరగంలో, జూబ్లీహిల్స్‌లో జరిగిన అభివృద్ధిని, పేదలకు అందిన సంక్షేమ పథకాలు ప్రజలు గమనించాలన్నారు. ఎన్నికలలో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందన్నారు. బీఆర్ఎఎస్ చేసిన అభివృద్ధి, కాంగ్రెస్ చేసిన మోసాలను ప్రజలందరి తెలుసని, కాంగ్రెస్ పాలకులకు బుద్ధిరావలంటే బీఆర్ఎస్ను గెలిపించాలని ప్రజలను కోరారు. ప్రతి ఓటరు తప్పకుండా కారు గుర్తుకు ఓటేసి, బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మాగంటి సునీతాగోపినాథ్కు భారీ మెజార్టీని అందించాలని కోరారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నేతలు ఉన్నారు.