కేపీహెచ్‌బీ కాలనీ, అక్టోబర్ 20 : మైత్రినగర్‌లో నెలకొన్న ప్రజా సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తానని కూకట్పల్లి(Kukatlatpally) ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు(MLA Madhavaram) అన్నారు. ఆదివారం క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే కృష్ణారావు, స్థానిక కార్పొరేటర్ సత్యనారాయణను మైత్రినగర్ సంక్షేమ సంఘం నూతన కమిటీ సభ్యులు కలిశారు. కాలనీలో నెలకొన్న పలు ప్రజా సమస్యలను ఎమ్మెల్యేకు వివరించారు. ఈ సందర్భంగా ఎమెల్యే కృష్ణారావు మాట్లాడుతూ..కాలనీలు, బస్తీలలో నెలకొన్న దీర్ఘకాలిక సమస్యలన్నింటిని పరిష్కరిస్తామన్నారు.
కాలనీలో ఇంకా మిగిలిన డ్రైనేజీ, విద్యుత్ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తానన్నారు. కాలనీలో ప్రజా సమస్యలను పరిష్కరించేందుకు పనిచేయాలని సూచించారు. ఆనంతరం నూతన కమిటీ సభ్యులను ఎమ్మెల్యే కృష్ణారావు శాలువాలతో సన్మానించి అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో అసోసియేషన్ అధ్యక్షుడు అర్జున్‌రావు, ప్రదాన కార్యదర్శి నవీన్‌కుమార్, కోశాధికారి లక్ష్మీనారాయణ, కాలనీ సీనియర్ నాయకుడు జగ్గారావు, తదితరులు ఉన్నారు.