కేపీహెచ్బీ కాలనీ, ఆగస్టు 7 : భవిష్యత్ తరాలు భూమిపై మనుగడ సాగించాలంటే… ప్రతి ఒక్కరు మొక్కలు నాటి(plant saplings) సంరక్షించాలని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు(MLA Krishna Rao) అన్నారు. బుధవారం కూకట్పల్లి రామాలయం వద్ద స్వచ్ఛదనం -పచ్చదనం కార్యక్రమంలో భాగంగా భక్తులకు, ప్రజలకు తులసి మొక్కలను ఎమ్మెల్యే కృష్ణారావు పంపిణీ చేశారు. ఆలయ ప్రాంగణంలో మొక్కను నాటి నీరు పోశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..పర్యావరణ సమతుల్యత లోపించడం వల్ల ప్రకృతిలో అతివృష్టి, అనావృష్టిలాంటి అనార్ధాలు లాంటివి సంభవిస్తున్నాయన్నారు.
పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకోవాలని, ఇంటి పరిసరాలలో కాలనీలలోని ఖాళీ ప్రదేశాలలో మొక్కలు నాటి సంరక్షించాలని కోరారు. కాలుష్యాన్ని తగ్గించేందుకు పచ్చదనాన్ని పెంపొందిం చాలన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు జూపల్లి సత్యనారాయణ, మాధవరం రోజాదేవి, మాజీ కార్పొరేటర్ రంగారావు, ఆలయ కమిటీ చైర్మన్ చిన్నతులసీ, భక్తులు, స్థానిక నేతలు ఉన్నారు.