కేపీహెచ్‌బీ కాలనీ, డిసెంబర్ 1 : కార్పొరేటర్లు ప్రజలకు ఎల్లప్పుడు అందుబాటులో ఉండాలని, ప్రభుత్వ నిర్లక్ష్యపూరిత వైఖరిని ఎండగడతూ..ప్రజా సమస్యల పరిష్కారానికి పోరాటాలు చేయాలని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు పిలుపునిచ్చారు. ఆదివారం కూకట్పల్లి క్యాంపు ఆఫీస్‌లో నియోజకవర్గానికి చెందిన కార్పొరేటర్లు, డివిజన్ల అధ్యక్ష, కార్యదర్శులు, ముఖ్య నేతలలో ఎమ్మెల్యే కృష్ణారావు సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డిసెంబర్ 9న మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవాన్ని విజయవంతం చేయాలని కో రారు. బీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌తో పాటు మాజీ మంత్రులు, జిల్లా పరిధిలోని ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధులు హాజరుకానున్నట్లు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాది కాలంలో అన్ని రంగాలలో విఫలమైందని, భవిష్యత్‌లో బీఆర్ఎస్ పార్టీయే అధికారంలోకి వస్తుందన్నారు.
బీఆర్ఎస్ పార్టీ నేతలంతా సంఘటితంగా ఉండాలని, కాంగ్రెస్ ప్రభుత్వ వైపల్యాలను ప్రజలకు వివరించాలని, బీఆర్ఎస్ పార్టీ బలోపేతం కోసం పనిచేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు జూపల్లి సత్యనారాయణ, ఆవుల రవీందర్‌రెడ్డి, పండాల సతీశ్‌గౌడ్, సబిహాగౌసొద్దీన్, రోజాదేవి రంగారావు, కో ఆర్డినేటర్ సతీశ్అరోరా, మాజీ కార్పొరేటర్లు పగుడాల బాబురావు, ఆయా డివిజన్ల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్ష కార్యదర్శులు శ్రీహరి, శాఖయ్య, సురేశ్‌యాదవ్, ఐలయ్య, అంబటి శ్రీనివాస్, భిక్షపతి, ఇర్ఫాన్, సంతోష్, వెంకటేశ్, సుదర్శన్‌రెడ్డి, హరినాథ్, ఖాజా, నరేశ్, తిరుపతి, ఎర్రవల్లి సతీశ్, ఏజాస్ తదితరులు పాల్గొన్నారు.