కేపీహెచ్‌బీ కాలనీ, అక్టోబర్ 15 : కూకట్పల్లి(Kukatpally) నియోజకవర్గంలోని పలు ప్రాంతాలలో పార్కులు, గ్రేవీయార్డ్లు, కమ్యూనిటీ హాల్ల పనులు పెండింగ్‌లో(Pending works) ఉన్నాయని, ఆ పనులను పూర్తి చేసేందుకు అవసరమైన నిధులను కేటాయించాలని కూకట్పల్లి జోనల్ కమిషనర్ అపూర్వ్ చౌహాన్‌ను ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు(MLA Madhavaram) కోరారు. మంగళవారం కూకట్పల్లి జోన్ ఆఫీస్‌లో.. నియోజకవర్గ సమస్యలపై జడ్సీతో ఎమ్మెల్యే కృష్ణారావు చర్చించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..కాలనీలు, బస్తీలలో ప్రజల అవరాలను తీర్చేందుకు పార్కులు, గ్రేవీయార్డ్లు, కమ్యూనిటీ హాల్ల నిర్మాణ పనులను శ్రీకారం చుట్టామన్నారు.
చేపట్టిన పనులు మధ్యలోనే ఆగిపోయాయని, ఆ పనులను పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. పెండింగ్‌లో ఉన్న పనులను పూర్తిచేసేందుకు అవసరమైన నిధులు కేటాయించి పనులను త్వరగా పూర్తిచేయాలని కోరారు. అలాగే నియోజకవర్గంలో ప్రజా సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. దీనికి జడ్సీ అపూర్వ్ చౌహాన్ సానుకులంగా స్పందించినట్లు ఎమ్మెల్యే తెలిపారు. కార్యక్రమంలో ఎస్ఈ చిన్నారెడ్డి, ఈఈ గోవర్ధన్ ఉన్నారు.