MLA Lakshmareddy | ఉప్పల్, మార్చి 20 : అభివృద్ధి, సంక్షేమం కోసం నిరంతరం పోరాటం కొనసాగిస్తామని ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి అన్నారు. చిలుకా నగర్ డివిజన్లో సుమారు కోటి రూపాయల వ్యయంతో పలు అభివృద్ధి పనులకు కార్పొరేటర్, మాజీ జిహెచ్ఎంసి స్టాండింగ్ కమిటీ మెంబర్ బన్నాల గీతా ప్రవీణ్ ముదిరాజ్తో కలిసి గురువారం ఎమ్మెల్యే పనులు ప్రారంభించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీ నెరవేర్చడానికి తన వంతు కృషి చేస్తామని చెప్పారు. ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడానికి నిధులను తీసుకువస్తామని పేర్కొన్నారు. కాలనీ వాసుల కోసం ఓపెన్ జిమ్ ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. కాలనీలో డ్రైనేజీ, నీటి కొరత సమస్యలు లేకుండా నిధులు తీసుకువచ్చి పనులు చేపట్టే విధంగా చూస్తామని అన్నారు. డివిజన్ అభివృద్ధికి ఎమ్మెల్యే సహకారంతో నిధులు తీసుకువస్తున్నామని కార్పొరేటర్ బన్నాల గీత ప్రవీణ్ ముదిరాజ్ తెలిపారు. డివిజన్ అభివృద్ధిలో కాలనీవాసులు భాగస్వాములు కావాలని కోరారు.
ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు బన్నాల ప్రవీణ్ ముదిరాజ్, బీఆర్ఎస్ నేతలు కొండల్ రెడ్డి, జెల్లి మోహన్, మధుసూదన్ రెడ్డి, పల్లె నర్సింగరావు, కోకొండ జగన్, రవీందర్ రెడ్డి, పిట్టల నరేష్, కొంపెల్లి రవీందర్ కొంపెల్లి రాజు, రాజ్ కుమార్, బొల్లం లక్ష్మణ్, అల్లిబిల్లి మహేందర్, మాస శేఖర్, కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు.