కేపీహెచ్బీ కాలనీ, జనవరి 1: ఒంటిమిట్టలోని కోదండరామస్వామి ఆలయంలో కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక పూజలు చేశారు. ఆదివారం నూతన సంవత్సరం సందర్భంగా ఎమ్మెల్యే క్యాంపు ఆఫీస్లో కార్పొరేటర్లు, బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నేతలు, ఆయా కాలనీల వెల్ఫేర్ అసోసియేషన్ నేతలు, ఆయా సంఘాల నేతలను కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నూతన సంవత్సరంలో నియోజకవర్గంలోని ప్రజలందరూ అనుకున్న లక్ష్యాలను సాధించాలని.. సుఖసంతోషాలతో జీవిస్తూ ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో వివేకనందనగర్ కార్పొరేటర్ రోజాదేవి, మాజీ కార్పొరేటర్ రంగారావు, కుటుంబ సభ్యులు ఉన్నారు.
ఎమ్మెల్యే కృష్ణారావుకు న్యూ ఇయర్ విషెస్
బాలానగర్, జనవరి 1: ఆదివారం కూకట్పల్లిలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావును కలిసి పూలబొకే అందించి ఫతేనగర్ కార్పొరేటర్ పండాల సతీశ్గౌడ్ 2023 సూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.