బేగంపేట్ మే 3: జహంగీర్ కుటుంబానికి (Jahangir family)పార్టీ పరంగా అండగా ఉంటామని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు(MLA Krishna Rao) అన్నారు. బీఆర్ఎస్ బేగంపేట్ డివిజన్ మైనార్టీ సెల్ మాజీ అధ్యక్షుడు జహంగీర్ ఇటీవల రోడ్డు ప్రమాదంలో(Road accident) తన కాలును కోల్పోవాల్సి వచ్చింది. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే కృష్ణారావు బేగంపేట్ కార్పొరేటర్ మహేశ్వరితో కలిసి సోమవారం జహాంగీర్ను హాస్పిటల్స్లో పరామర్శించారు.
జహంగీర్ కుటుంబానికి అండగా ఉంటామని, ధైర్యంగా ఉండాలని ఎమ్మెల్యే సూచించారు. కార్యకర్తలను బీఆర్ఎస్ పార్టీ కంటికి రెప్పలా కాపాడుకుంటుందని ఆయన తెలిపారు. బీఆర్ఎస్ పార్టీలోనే ప్రతి కార్యకర్తకు సరైన గుర్తింపు ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో బేగంపేట్ డివిజన్ అధ్యక్షుడు సురేశ్యాదవ్, నాయకులు శ్రీహరి తదితరులు పాల్గొన్నారు.