దుండిగల్, సెప్టెంబర్ 23 : ప్రణాళికబద్ధంగా అభివృద్ధి పనులు చేపడుతామని కుత్బుల్లాపూర్ నియోజకవర్గం శాసనసభ్యుడు కేపీ వివేకానంద్(MLA KP Vivekanand) పేర్కొన్నారు. సోమవారం 125 గాజులరామారం డివిజన్ షిరిడిహిల్స్లో రూ. 49.50 లక్షల రూపాయలతో చేపట్టనున్న సీసీ రోడ్డు పనులకు(CC road works) ఎమ్మెల్యే వివేకానంద్ ముఖ్య అతిథిగా విచ్చేసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలోని అన్ని డివిజన్లలో ప్రణాళికబద్ధంగా పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నా మన్నారు.
అదేవిధంగా భవిష్యత్తులో కూడా మరిన్ని పనులు చేపట్టి కాలనీలలో మౌలిక వసతులు కల్పించి ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతామన్నారు. అనంతరం కుత్బుల్లాపూర్ మండల రెవెన్యూ కార్యాలయంలో నియోజకవర్గానికి చెందిన 372 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి చెక్కులను ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ ముఖ్యఅతిధిగా హాజరై అందించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ అబ్దుల్ రెహమాన్ఖాన్, ఆర్ఐ విజయ్, ఖలీం తదితరులు పాల్గొన్నారు.