హైదరాబాద్ : సీఎం రేవంత్ రెడ్డిపై(CM Revanth Reddy) కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్(MLA KP Vivekanand) ఫైర్ అయ్యారు. సీఎం హోదాలో ఉండి బజారు భాష మాట్లాడుతున్న తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన తెలంగాణ భవన్లో మీడియా సమావేశంలో మాట్లాడారు. రేవంత్ రెడ్డి ఏది పడితే అది మాట్లాడుతాడు. ఫుట్‌పాత్ గాళ్లు మాట్లాడినట్టు, లోఫర్, లఫంగ మాటలు మాట్లాడుతుండు.
రేవంత్ రెడ్డి అప్పుడప్పుడు ముఖ్యమంత్రి అనే విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. ఇలాంటి మాటలు ముఖ్యమంత్రి స్థాయి వాళ్లు మాట్లాడకూడదు అనేది మా బాధ అన్నారు. ఇప్పటికైనా ఆయన తాను సీఎం అనే విషయాన్ని గుర్తెరిగి ఆ పోస్ట్‌కు గౌరవం తెచ్చేలా పాలన కొనసాగించాలని హితవు పలికారు.
రేవంత్ రెడ్డి అప్పుడప్పుడు ముఖ్యమంత్రి అనేది గుర్తుంచుకోవాలి
ఏది పడితే అది మాట్లాడుతాడు.. ఫుట్‌పాత్ గాళ్లు మాట్లాడినట్టు, లోఫర్, లఫంగ మాటలు మాట్లాడుతుండు.
ఇవన్నీ మాటలు ముఖ్యమంత్రి మాట్లాడకూడదు అనేది మా బాధ – కేపీ వివేకానంద pic.twitter.com/k3IBQmOrf3
— Telugu Scribe (@TeluguScribe) September 16, 2024