కుత్బుల్లాపూర్ : జీడిమెట్ల డివిజన్ దండముడి కాలనీకి ఆనుకొని ఉన్న అల్లంచెరువులోకి(Allam Pond) మురుగునీరు చేరకుండా తగు చర్యలు తీసుకోవాలని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్(MLA KP Vivekanand) ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. మంగళవారం ఆయన చెరువు పరిసరా ప్రాంతాన్ని అధికారులతో కలిసి పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అల్లం చెరువును కాకతీయ మిషన్ పథకం కింద రూ.40 లక్షల వ్యయంతో సుందరీకరణ చేసి, స్థాణిక ప్రజలకు అహ్లాదకరమైన వాతావరణాన్ని అందించేందుకు అన్నీ సౌకర్యాలు కల్పించామన్నారు. ఎట్టి పరిస్థితిలో చెరువులో మురుగు నీరు చేరకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో కుత్బుల్లాపూర్ సర్కిల్ ఇంజినీరింగ్ అధికారులు, కాలనీవాసులు, పార్టీ శ్రేణులు ఉన్నారు.
ఇవి కూడా చదవండి..
KTR | వరి పంటలో తెలంగాణను దేశంలోనే నెంబర్ వన్ చేసిండ్రు కేసీఆర్ : కేటీఆర్
KTR | ప్రపంచంలో ప్రజాశక్తి కంటే గొప్పదేదీ లేదని రుజువు చేసిన గడ్డ నల్లగొండ : కేటీఆర్
KTR | రైతు ధర్నాకు వచ్చినట్లు లేదు.. విజయోత్సవ ఊరేగింపులా ఉంది : కేటీఆర్