గంగపుత్రుల సమగ్రాభివృద్ధికి కృషి
నియోజకవర్గంలోని గంగపుత్ర కులస్తుల సమగ్రాభివృద్ధికి కృషి చేస్తానని ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ అన్నారు. అంబర్‌పేట డివిజన్ అలీకేఫ్ చౌరస్తాలోని ఎస్ఆర్జీ ఫంక్షన్హాల్లో ఆదివారం ప్రేమ్‌నగర్ గంగపుత్ర సేవా సంఘం ఆత్మీయ సమ్మేళనం జరి గింది.
- అంబర్‌పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్
అంబర్‌పేట, జూలై 23 : నియోజకవర్గంలోని గంగపుత్ర కులస్తుల సమగ్రాభివృద్ధికి కృషి చేస్తానని ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ అన్నారు. అంబర్‌పేట డివిజన్ అలీకేఫ్ చౌరస్తాలోని ఎస్ఆర్జీ ఫంక్షన్హాల్లో ఆదివారం ప్రేమ్‌నగర్ గంగపుత్ర సేవా సంఘం ఆత్మీయ సమ్మేళనం జరి గింది. ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ హాజరై మాట్లాడుతూ సీఎం కేసీఆర్ నాయకత్వంలోని బీఆర్ఎస్ ప్రభుత్వం అన్ని కులాల అభివృద్ధికి పాటుపడుతుందన్నారు. గత ప్రభుత్వాల హయాంలో కులవృత్తులను నాశనం చేశారని, కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యాక అన్ని కుల వృత్తులకు ప్రాధాన్యమిస్తూ అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నారని చెప్పారు. సీఎం కేసీఆర్ జనరంజక పాలనలో అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉన్నారని తెలిపారు. గంగపుత్రులందరికీ తనవంతు సహాయ,సహకారాలు అంది స్తానని వెల్లడించారు. కార్యక్రమంలో కార్పొరేటర్ ఇ.విజయ్‌కుమార్‌గౌడ్, బీజేవైఎం నాయకుడు ఎ.యశ్వంత్, సంఘం వ్యవస్థాపకులు పెంటంరాజు, చైర్మన్ పెంటం నర్సయ్య, అధ్యక్షుడు గడ్డం పోచయ్య, ప్రధాన కార్యదర్శి దేవరాజు, ఉపాధ్యక్షుడు రాములు, కోశాధికారి కె.లింగం తదితరులు పాల్గొన్నారు.
ముదిరాజ్ సంఘం భవనం స్థలం కేటాయింపునకు చర్యలు : ఎమ్మెల్యే
అంబర్‌పేట ముదిరాజ్ సంఘం భవన నిర్మాణానికి స్థలం కేటాయింపు కోసం చర్యలు తీసుకుంటానని ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ అన్నారు. ఆదివారం అంబర్‌పేట ముదిరాజ్ సంఘం నాయకులు గోల్నాక క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యేను మర్యాదపూర్వకంగా కలి శారు. తమ సామాజిక భవనం అందుబాటులోకి వస్తే సుమారు 30 వేల మంది వివిధ రకాల కార్యక్రమాలు నిర్వహించుకోవడానికి ఉపయోగపడుతుందని పేర్కొ న్నారు. సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యే స్థలం కేటాయింపునకు చర్యలు చేపడతానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ఆసంఘం అధ్యక్షుడు సతీశ్‌ముదిరాజ్, ప్రధాన కార్యదర్శి కిశోర్ ముదిరాజ్, ప్రతినిధులు శ్రీరాములుముదిరాజ్, భరత్ ముదిరాజ్, ప్రశాంత్ ముదిరాజ్,లక్ష్మి, అంజయ్య, నర్సింగ్ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

