గోల్నాక, నవంబర్ 16 : ప్రభుత్వం అమలు చేసే సంక్షేమ పథకాలను అర్హులైన లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలని అంబర్ పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ కోరారు. ఆదివారం గోల్నాక క్యాంపు కార్యాయం వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో 30 మంది లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి మంజూరైన రూ.12 లక్షల విలువగల చెక్కులను ఆయన పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..ఆపత్కాలంలో పేద, మధ్య తరగతి ప్రజలకు సీఎం రిలీఫ్ ఫండ్ ఓ వరం లాంటిదని అన్నారు. బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ త్వరిగతిన అందజేసేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని ఈ సందర్భంగా ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ తెలిపారు.