గోల్నాక, సెప్టెంబర్ 3 : గత ఐదేండ్లుగా అంబర్పేట(Amberpet) నియోజకవర్గ వ్యాప్తంగా పక్కా ప్రణాళికతో రూ.కోట్లాది వ్యయంతో వరద నీటి పైప్ లైన్ల పనులు ప్రక్షాళన చేయండతో అంబర్ పేటలో ముంపు సమస్య తప్పిందని ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్(MLA Kaleru Venkatesh) అన్నారు. మంగళవారం గోల్నాక డివిజన్ శాంతినగర్లో స్థానిక కార్పొరేటర్ దూసరి లావణ్య శ్రీనివాస్ గౌడ్ తో కలసి రూ.7లక్షల అంచనా వ్యయంతో ఏర్పాటు చేస్తోన్న డ్రైనేజీ పైప్ లైన్ పనులను ఆయన ప్రారంభించారు. అనంతరం బస్తీలో కలియతిరుగుతూ స్థానిక సమస్యలు అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..అంబర్ పేట నియోజకవర్గ వ్యాప్తంగా మౌలిక సదుపాయల కల్పనకు తాము అధిక ప్రాధన్యత ఇచ్చామన్నారు. వరద నీటి పైప్ లైన్లు, డ్రైనేజీ పైప్ లైన్లు, రహదారుల ఆధునీకరణ, పార్కుల సుందరీకరణ, కమ్యూనిటీ హాల్ల ఏర్పాటు తదితర అభివృద్ధి పనులు చేపట్టామని తెలిపారు. గత వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు రాష్ర్టాన్ని, హైదరాబాద్ నగరాన్ని అతలాకుతలం చేస్తన్నాయని అన్నారు. అయినా మందుస్తుగా తీసుకున్న చర్యలతో అంబర్ పేట నియోజకవర్గ వ్యాప్తంగా ఎలాంటి ముంపు సమస్య ఏర్పడలేదన్నారు