కాచిగూడ,డిసెంబర్ 17: పెండింగ్ పనులపై ప్రత్యేక దృష్టి సారించినట్లు, ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా ఎల్లవేళల అందుబాటులో ఉంటానని అంబర్‌పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ అన్నారు. కాచిగూడ డివిజన్లోని జమాల్బస్తీ, నింబోలి అడ్డా, మౌలానా ఆజాద్‌నగర్ తదితర బస్తీలలో బుధవారం ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్, స్థానిక కార్పొరేటర్‌తో పలిసి పాదయాత్ర సమస్యలను అడిగి తెలుసుకున్నారు.ఈ సందర్భంగా బస్తీవాసులు కొన్ని రోజులుగా లోఫ్రెషర్ నీటి సమస్య తలెత్తుతుందని, స్పీడ్ బ్రేకర్లు, స్ట్రీట్ లైట్లు, డ్రైనేజీ సమస్యలు ఎదుర్కొంటున్నామని స్థానిక ప్రజలు ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన ఎమ్మెల్యే సమస్యలను పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
నియోజకవర్గంలో పెండింగ్‌లోని ఉన్న పలు సమస్యలను దశలవారీగా పరిష్కరిస్తాననని హామీ ఇచ్చారు. ఏ డివిజన్లోనైన డ్రైనేజీ, నీటి సమస్య వచ్చిన వెంటనే అధికారులు పరిష్కరించాలని ఎమ్మెల్యే ఆదేశించారు. నియోజకవర్గంలోని డివిజన్లను అభివృద్దిచేస్తూ, మౌలిక సదుపాయలు కల్పించేందుకు బాధ్యతగా కృషి చేస్తున్నట్లు తెలిపారు. ప్రజా సమస్యలను సిబ్బంది నిర్లక్ష్యం చేస్తే చర్యలు తప్పవని అధికారులను హెచ్చరించారు.
బస్తీలో ఉన్న సమస్యలను నేరుగా తన దృష్టికి తీసుకువస్తే వాటి పరిష్కారానికై కృషి చేస్తానని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జలమండలి డీజీఎం కృష్ణ, వర్క్ ఇన్స్పెక్టర్ వెంకటేశ్‌యాదవ్, కన్నె రమేశ్‌యాదవ్, బి.కృష్టాగౌడ్, సునీల్ బిడ్లాన్, ఓం ప్రకాశ్‌యాదవ్, ధాత్రిక్ నాగేందర్బాబ్జి, సుభాశ్ పటేల్, మహేశ్‌కుమార్, బబ్లూసింగ్, అంటో, అరవింద్, శ్రీకాంత్ ముదిరాజ్, పి.సతీశ్, భీంరాజ్,తదితరులు పాల్గొన్నారు.