అంబర్‌పేట, జనవరి 21 : అంబర్‌పేట నియోజకవర్గంలోని అన్ని పార్కులను(Amberpet parks) అందంగా తీర్చిదిద్దినట్లు ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్(MLA Kaleru Venkatesh) అన్నారు. బాగ్‌అంబర్‌పేట డివిజన్లోని సెంట్రల్ ఎక్సైజ్ కాలనీ పార్కులో రూ.6 లక్షలతో చేపట్టనున్న మరమ్మతు, సుందరీకరణ పనులను డివిజన్ కార్పొరేటర్ బి.పద్మావెంకటరెడ్డితో కలిసి ఎమ్మెల్యే మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. నియోజకవర్గంలోని బర్కత్‌పుర హౌసింగ్ బోర్డు కాలనీ పార్కు, నల్లకుంటలోని మోత నాగేశ్వర్రావు పార్కు, నరేంద్ర పార్కు, గోల్నాకలోని తులసీనగర్ కాలనీ పార్కు, బాగ్‌అంబర్‌పేట డివిజన్లోని సోమసుందర్నగర్ పార్కు, వైభవ్‌నగర్ పార్కులను అన్నింటిని సుందరీకరించినట్లు పేర్కొన్నారు. వీటి అభివృద్ధికి కొన్ని కోట్లు వెచ్చించామన్నారు.
అలాగే సీపీఎల్ రోడ్డును కూడా సుందరంగా తీర్చిదిద్దామని తెలిపారు. ఫీవర్ హాస్పిటల్ బ్రిడ్జి వద్ద రెండు వైపుల కూడా అందంగా తయారు చేశామన్నారు. పార్కులనే కాకుండా నియోజకవర్గంలోని అన్ని ప్రాంతాలలో అభివృద్ధి పనులు చేసినట్లు వెల్లడించారు. పెండింగ్‌లో ఉన్న పనులపై ఎప్పటికప్పుడు సమీక్ష నిర్వహించి అవి త్వరగా పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటున్నామని వివరించారు.
ఈ కార్యక్రమంలో సీఈ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు రామకృష్ణరాజు, ప్రధాన కార్యదర్శి పడాల వెంకట్రావు, కోశాధికారి సత్యనారాయణ, ఆర్గనైజింగ్ సెక్రటరీ సుధాకర్‌రావు, ప్రతినిధులు సత్యం, నాగేశ్వర్రావు, పార్థసారిథి, సాంబమూర్తి, సంగీత, ఉషా, శైలజ, మోనరిలేకర్, జ్యోతిరెడ్డి, జ్యోతిర్లతలతో పాటు బీఆర్ఎస్ డివిజన్ అధ్యక్షుడు సీహెచ్ చంద్రమోహన్, సీనియర్ నాయకులు వి.రవీందర్రావు, అరుణ్‌కు మార్రెడ్డి, శ్రీరాములుముదిరాజ్, అఫ్రోజ్పటేల్, పి.గెల్వయ్య, టి.రమేష్, మిర్యాల రవీందర్, మిర్యాల శ్రీనివాస్, ఉప్పు సుధాకర్, గోవిందు అర్జున్, శ్రీహరి, ఎన్.వెంకటరమణరాజు, బంగారు శ్రీను, బొట్టు శ్రీను, నవీన్‌యాదవ్, సాయి తదితరులు పాల్గొన్నారు.