MLA Kaleru Venkatesh | కాచిగూడ, డిసెంబర్ 2: పేద విద్యార్థులు ఉన్నత చదువులు చదివి, ఉన్నత శిఖరాలను అధిరోహించడానికి మాజీ సీఎం కేసీఆర్ ప్రభుత్వం కట్టుబడి ఉండేదని, నేటి కాంగ్రెస్ ప్రభుత్వం విద్యార్థులకు పౌష్టిక ఆహారం అందించకుండా నాణ్యత లేని ఆహారం అందిస్తున్నదని అంబర్పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ అన్నారు. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రసిడెంట్ కేటీఆర్ ఆదేశాల మేరకు, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పర్యవేక్షణలో బీఆర్ఎస్వీ అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ ఆధ్వర్యంలో గురుకుల బాట కార్యక్రమంలో భాగంగా సోమవారం కాచిగూడ ప్రభుత్వ పాఠశాలను సందర్శించి, భోజన సౌకర్యాలను స్వయంగా విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు.
అనంతరం, ఎమ్మెల్యే మాట్లాడుతూ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు పౌష్టిక ఆహారాన్ని అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. విద్యార్థుల ముఖంలో చిరునవ్వు చుడాలనే ఉద్దేశంతో మాజీ సీఎం కేసీఆర్ దృఢ సంక్పలంతో పలు సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టాడని పేర్కొన్నారు. విద్యార్థులకు ఎలాంటి లోటు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కాచిగూడ డివిజన్ అధ్యక్షుడు ఎర్ర భీష్మాదేవ్, క్రాంతి, తదితరులు పాల్గొన్నారు.