అంబర్‌పేట/గోల్నాక, జూన్ 21: అంబర్‌పేట నియోజకవర్గంలో అభివృద్ధి పరుగులు తీస్తున్నదని ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ అన్నారు. నియోజకవర్గంలోని అన్ని ప్రాంతాలను సమానంగా అభివృద్ధి చేస్తున్నానని పేర్కొన్నారు. నల్లకుంట డివిజన్లోని భాగ్యనగర్‌లో రూ. 17.50లక్షలతో నూతనంగా నిర్మించనున్న సీసీ రోడ్డు పనులను డివిజన్ కార్పొరేటర్ వై.అమృతతో కలిసి ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. నియోజకవర్గంలో అభివృద్ధి పనులకు అదనంగా మరో రూ.30 కోట్ల నిధులు కొత్తగా విడుదలయ్యాయని చెప్పారు. కాచిగూడ, నల్లకుంట, గోల్నాక, అంబర్‌పేట, బాగ్‌అంబర్‌పేట తదితర డివిజన్లలోని బస్తీ లు, కాలనీల్లో రోడ్లు, మంచినీటి, డ్రైనేజీ పైప్‌లైన్ పనులను ముమ్మరంగా చేపడుతున్నామని తెలిపారు. చాలా ప్రాంతాల్లో కొత్త రోడ్లను నిర్మించడం జరిగిందన్నారు. డీడీ కాలనీ వంటి ప్రాంతాలలో బీటీ రోడ్లను ఏర్పాటు చేస్తున్నామన్నారు. అంతకుముందు బస్తీలో ఉన్న శ్రీనల్లపోచమ్మ దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, పూజారి శర్మను సత్కరించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ డివిజన్ అధ్యక్షుడు మేడి ప్రసాద్, సీనియర్ నాయకులు కె.నరేందర్, రాముయాదవ్, భాస్కర్‌గౌడ్, శ్రీనివాస్‌రెడ్డి, గాలపల్లి శంకర్, భూపతినాథ్, ధర్మారావు, యూసుఫ్, నవీన్, రాజు, బీజేపీ నాయకులు నందు, కిశోర్‌కుమార్, జె.కె.బాబు తదితరులు పాల్గొన్నారు.
వ్యాప్తంగా ప్రధాన రహదారులతో పాటు అంతర్గత రహదారులను రూ.12 కోట్ల ప్రత్యేక నిధులతో ఆద్దంలా మారుస్తున్నామని ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ తెలిపారు. బుధవారం గోల్నాక డివిజన్లోని కమలానగర్లో రూ.16 లక్షల అంచనా వ్యయంతో కొత్తగా ఏర్పాటు చేస్తున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులను స్థానిక కార్పొరేటర్ దూసరిలావణ్యశ్రీనివాస్గౌడ్తో కలసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. నియోజకవర్గ వ్యాప్తంగా మౌలిక వసుతుల కల్పనకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని అన్నారు. తాజాగా ఎమ్మెల్యే బడ్జెట్ నుంచి రూ. 30 కోట్లు మంజూరయ్యాయని తెలిపారు. అందులో రూ.12 కోట్ల వ్యయంతో 54 ప్రాంతాల్లో సీసీ రోడ్ల ఏర్పాటుతో పాటు మరో రూ.18 కోట్ల వ్యయంతో 99 ప్రాంతాల్లో డ్రైనేజీ, మంచినీటి పైప్లైన్ల వ్యవస్థను ఆధునీకరిస్తామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో పలు శాఖల అధికారులు, బస్తీవాసులు, స్థానిక బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.
అన్ని దేవాలయాలను అభివృద్ధి చేస్తూ ప్రతి దేవాలయానికి భక్తుల తాకిడి పెరిగేలా చేసిన సీఎం కేసీఆర్ నిజమైన హిందువని ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ అన్నారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా బుధవారం బాగ్‌అంబర్‌పేట గురువాయూర్ శ్రీకృష్ణ మందిర్‌లో ఆధ్యాత్మిక దినోత్సవాన్ని నిర్వహించారు. అయ్యప్పటెంపుల్లో ప్రత్యేక పూజలు చేశారు. దేవాలయంలో పనిచేసే అర్చకులను, గురుస్వాములను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కుల మతాలకు అతీతంగా దేవాలయాలు, మసీదులు, చర్చిల అభివృద్ధికి అనేక నిధులను కేటాయిస్తున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ ఇ. విజయ్‌కుమార్‌గౌడ్, బీఆర్ఎస్ డివిజన్ అధ్యక్షుడు సీహెచ్ చంద్రమోహన్, సీనియర్ నాయకులు శ్రీరాములుముదిరాజ్, ఎర్రబోలు న ర్సింహారెడ్డి, మిర్యాల రవీందర్, కెంచె మహేశ్, పి. గెల్వయ్య, రమేశ్‌నాయక్, శివాజీయాదవ్, శ్రీహరి, మధుసూధన్‌రెడ్డి, బాల్‌రాజు, రాంచందర్, శివకుమార్‌గుప్త, నిరంజన్, సి.మల్లేశ్‌యాదవ్, నవీన్‌యాదవ్, స్వామి, చంద్రమౌళి, ఈశ్వర్, శేఖర్‌రెడ్డి, అనిల్‌కుమార్, రామారావుయాదవ్, ప్రవీణ్, టి.సుభాష్, సంతోష్‌చారి, శాతం సూరి, యాదగిరి తదితరులు పాల్గొన్నారు.