జిన్నారం(అమీన్పూర్), జనవరి 11: అమీన్పూర్ పరిధి కిష్టారెడ్డిపేటను నూతన డివిజన్‌గా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ అఖిలపక్ష నాయకులు చేపట్టిన రిలే నిహార దీక్ష రెండో రోజుకు చేరుకుంది. ఆదివారం కిష్టారెడ్డిపేట ప్రధాన రహదారిపై రాస్తారోకో చేపట్టారు. వారి దీక్షకు ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి సంఘీభావం ప్రకటించారు.
ప్రభుత్వం స్పందించి 80వేల జనాభా ఉన్న కిష్టారెడ్డిపేటను డివిజన్‌గా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. అమీన్పూర్ సర్కిల్ పరిధిలో నాలుగు డివిజన్లను ఏర్పాటు చేసేలా ఇప్పటికే ప్రభుత్వాన్ని కోరామని, కొత్త డివిజన్లను ఏర్పాటు చేయని పక్షంలో జీహెచ్ఎంసీ కార్యాలయం ముందు 10వేల మందితో బల్దియా ముట్టడిస్తామన్నారు. నాయకులు మాణిక్‌యాదవ్, దేవానంద్, సుధాకర్‌రెడ్డి, తులసీరెడ్డి తదితరులు పాల్గొన్నారు.