MLA Devireddy Sudheer Reddy | వనస్థలిపురం, మే 7 : హైదరాబాద్ బీఎన్ రెడ్డి నగర్ డివిజన్లోని పలు కాలనీల్లో అంతర్గత సీసీ, బీటీ రోడ్లు నిర్మించేందుకు నిధులు మంజూరు చేయాలని ఎల్బీ నగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి కోరారు. ఈ మేరకు జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్‌ను బుధవారం కలిసి వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. బీఎన్‌రెడ్డి నగర్ డివిజన్ పరిధిలోని శ్రీ కృష్ణ దేవరాయనగర్, బీఎన్ రెడ్డి.నగర్ కాలనీ, సెల్ఫ్ ఫైనాన్స్ కాలనీ, సచివాలయ నగర్, హరిహరపురం కాలనీ, వైదేహి నగర్ నార్త్ కాలనీ, సాయిరాం నగర్ కాలనీ, విజయపురి ఫేజ్ 1, ఫేజ్ 2, గాయత్రినగర్ బ్యాంకు కాలనీ, టీచర్స్ కాలనీ ఫేజ్ 2, వెంకటేశ్వర కాలనీ, గాయత్రినగర్, గాయత్రినగర్ ఫేజ్ 4, విజయనగర్ కాలనీ, ఆఫీసర్స్ కాలనీ, గాయత్రి నగర్ ఫేజ్ 2 కాలనీలో అంతర్గత సీసీ రోడ్ల నిర్మాణానికి నిధులు విడుదల చేయాలని కోరారు. శివసింధు చౌరస్తా నుంచి మెడికల్ హెల్త్ కాలనీ వరకు బీటీ మెయిన్ రోడ్డు నిర్మాణం చేపట్టాలని సూచించారు. ఈ ప్రతిపాదనలపై స్పందించిన కమిషనర్ త్వరలోనే నిధులను మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు.