e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Saturday, September 25, 2021
Home హైదరాబాద్‌ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి

సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి

మన్సూరాబాద్‌, సెప్టెంబర్‌ 14 : టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు సోషల్‌ మీడియాలో చురుకుగా వ్యవహరిస్తూ ప్రతిపక్షాలు చేస్తున్న అసత్య ఆరోపణలను తిప్పికొట్టడంతో పాటు పేదల కోసం సీఎం కేసీఆర్‌ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఎంఆర్‌డీసీ చైర్మన్‌, ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి తెలిపారు. ఎల్బీనగర్‌ నియోజకవర్గం పార్టీ సంస్థాగత ఎన్నికల విస్తృతస్థాయి సమావేశం మంగళవారం నాగోల్‌ డివిజన్‌ బండ్లగూడలోని అనంతుల రాంరెడ్డి గార్డెన్‌లో జరిగింది.

ఈ సమావేశానికి ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి, సంస్థాగత ఎన్నికల ఎల్బీనగర్‌ టీఆర్‌ఎస్‌ ఇన్‌చార్జి మర్రి రాజశేఖర్‌ రెడ్డి, ఎమ్మెల్సీలు మల్లేశం, దయానంద్‌ ముఖ్య అతిథులుగా హాజరయ్యా రు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రతి కార్యకర్త, నాయకుడు రోజూ ఐదు నిమిషాలు తమ సమయా న్ని పార్టీ కోసం కేటాయించి సోషల్‌ మీడియా ద్వారా సీఎం కేసీఆర్‌ చేపడుతున్న అభివృద్ధిఫలాలను ప్రజలకు వివరించాలన్నారు.

- Advertisement -

దేశంలోని ఏ రాష్ట్రంలో లేనివిధంగా సీఎం కేసీఆర్‌ తెలంగాణ రాష్ట్రంలో కల్యాణలక్ష్మి, షాదీముబాకర్‌, రైతుబంధు, దళిత బంధు లాంటి ఎన్నో సం క్షేమ పథకాలను ప్రవేశపెట్టారన్నారు. సీఎం కేసీఆర్‌, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ రాష్ట్ర ప్రజల శ్రేయస్సుకోసం పాటుపడుతున్నారన్నారు. కేంద్రంలోని బీజేపీ అనుసరిస్తున్న విధానాల వల్ల దేశంలోని ప్రజలు సంతోషంగా లేరని గ్యాస్‌, డీజిల్‌, పెట్రోల్‌ ధరలను పెంచుతూ పేదల నడ్డి విరుస్తున్నదన్నారు. ఎల్బీనగర్‌ నియోజకవర్గం పరిధిలోని డివిజన్ల కమిటీలను త్వరలో ప్రకటిస్తామని తెలిపారు. పార్టీ పదవులు ఆశించే వారు దరఖాస్తు చేసుకోవాలని అర్హులైన వారికి సముచిత స్థానం కల్పిస్తామన్నారు.

మహిళలకు అధిక ప్రాధాన్యం..

నూతనంగా ఏర్పాటు చేస్తున్న టీఆర్‌ఎస్‌ కమిటీలలో ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ సూచనల మేరకు మహిళలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు అధిక ప్రాధాన్యమివ్వనున్నట్లు మర్రి రాజశేఖర్‌ రెడ్డి తెలిపారు. పార్టీ క్రియాశీలక సభ్యత్వం తీసుకున్న వారికే ఈ కమిటీలలో స్థానం కల్పిస్తామన్నారు. కార్యక్రమంలో కర్మన్‌ఘాట్‌ ప్రసన్నాంజనేయ స్వామి దేవాలయం కమిటీ చైర్మన్‌ పోచబోయిన ఈ శ్వరమ్మ, గడ్డిఅన్నారం మార్కెట్‌ కమిటీ మాజీ చైర్మన్‌ పురుషోత్తం రావు, రాష్ట్ర నాయకులు మధుసూదన్‌ రెడ్డి, వెంకటేశ్వర్‌ రావు, మాజీ డిప్యూటీ ఫ్లోర్‌లీడర్‌ వజీర్‌ ప్రకాశ్‌గౌడ్‌, మాజీ కార్పొరేటర్లు విఠల్‌రెడ్డి, సంగీత, లక్ష్మీప్రస న్న, రాజశేఖర్‌ రెడ్డి, విఠల్‌రెడ్డి, సాగర్‌ రెడ్డి, భవానీప్రవీణ్‌కుమార్‌, పద్మానాయక్‌, తిరుమల్‌ రెడ్డి, శ్రీనివాస రా వు, వివిధ డివిజన్ల టీఆర్‌ఎస్‌ అధ్యక్షులు నాగరాజు, సతీశ్‌యాదవ్‌, మల్లేశ్‌ముదిరాజ్‌, అరవింద్‌ రెడ్డి, రవి, తిలక్‌, రాహుల్‌ గౌడ్‌, రఘునాథ్‌ రెడ్డి, పవన్‌, నాయకులు ప్రశాంత్‌గౌడ్‌, నర్సింహారావు, రాజిరెడ్డి, రఘువీర్‌ రెడ్డి, జగదీశ్‌యాదవ్‌, రాజుగౌడ్‌, రాములు, రాంబాబు, కృష్ణ, చిరంజీవి, ఉదయ్‌గౌడ్‌, అర్చన, రంగేశ్వరి, యాదగిరి, మోహన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

సీఎం కేసీఆర్‌ చిత్రపటానికి క్షీరాభిషేకం..

ఎల్బీనగర్‌, సెప్టెంబర్‌ 14 : ఎల్బీనగర్‌ నియోజకవర్గం టీఆర్‌ఎస్‌ టీఆర్‌ఎస్‌ విస్తృత స్థాయి కార్యకర్తల సమావే శం మంగళవారం నాగోల్‌లోని అనంతుల రాంరెడ్డి గార్డెన్స్‌లో పార్టీ నాయకుడు మర్రి రాజశేఖర్‌రెడ్డి, ఎల్బీనగర్‌ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి, ఎమ్మెల్సీలు మల్లేశం, దయానంద్‌ గుప్తా ఆధ్వర్యంలో జరిగింది. ఈ సమావేశానికి చైతన్యపురి డివిజన్‌ నుంచి మాజీ కార్పొరేటర్‌ విఠల్‌రెడ్డి ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు భారీగా తరలివెళ్లారు. అంతకుమందు చైతన్యపురిలోని తెలంగాణ తల్లి విగ్రహం వద్ద టీఆర్‌ఎస్‌ జెండాను ఎగురవేసి సీఎం కేసీఆర్‌ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. కార్యక్రమంలో డివిజన్‌ అధ్యక్షుడు పవన్‌, మాజీ కౌన్సిలర్‌ త్రివేది, శ్రీనివాస్‌, నరేశ్‌, రమణారెడ్డి, పలువురు నాయకులు పాల్గొన్నారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement
Namasthe Telangana