ఎల్బీనగర్, అక్టోబర్ 14: మూసీ పరీవాహక ప్రాంతంలోని ఇండ్లకు సంబంధించిన ఒక్క ఇటుకనూ కూల్చనివ్వమని, మూసీ బాధితులకు అన్ని విధాలుగా అండగా ఉంటామని ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి భరోసా ఇచ్చారు. మూసీ ప్రాంతంలోని చైతన్యపురి డివిజన్ ఫణిగిరికాలనీలోని నివాసాలను అధికారులు కూల్చివేస్తారంటూ ఓ చానల్లో వార్త ప్రసారం కావడంతో భయాందోళనకు గురైన కాలనీవాసులు ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డిని ఆయన క్యాంపు కార్యాలయంలో కలిసి వివరించారు.
ఈ మేరకు ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి మాట్లాడుతూ మూసీ పరీవాహక ప్రాంతంలోని నివాసితులు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. మాజీ కార్పొరేటర్ విఠల్‌రెడ్డి, నాయకులు పవన్, కడియం మోహన్‌రాజ్, కాలనీవాసులు వేణుగోపాల్, వీరాచారి, శంకర్ తదితరులు పాల్గొన్నారు.