హయత్‌నగర్, అక్టోబర్ 30 : సీఎం కేసీఆర్ తెలంగాణలో అమలు చేసిన సంక్షేమాభివృద్ధి, ఎల్బీనగర్లో ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి చేపట్టిన అభివృద్ధిని చూసి కారు గుర్తుకు ఓటేసి భారీ మెజార్టీతో గెలిపించాలని బీఆర్ఎస్ పార్టీ హయత్‌నగర్ డివిజన్ మహిళా అధ్యక్షురాలు శివగోని అంజలిగౌడ్ అభ్యర్థించారు. సోమవారం హయత్‌నగర్ డివిజన్ పరిధిలోని భూలక్ష్మినగర్ కాలనీలో అంజలిగౌడ్, పలువురు మహిళలతో కలిసి ఇంటింటికీ వెళ్లి బీఆర్ఎస్ ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎల్బీనగర్ నియోజవకర్గంలో ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి దాదాపు రూ.3,500 కోట్ల వ్యయంతో అభివృద్ధి పనులు చేపట్టారని గుర్తుచేశారు.
ఎల్బీనగర్, బైరామల్‌గూడ చౌరస్తాల్లో ట్రాఫిక్ నియంత్రణ కోసం ఫ్లైఓవర్లు, అండర్‌పాస్ బ్రిడ్జిలు నిర్మించిన ఘనత ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డికే దక్కుతుందని కొనియాడారు. వర్షాకాలంలో నియోజకవర్గంలోని ఆయా డివిజన్లలో ముంపు సమస్యను శాశ్వతంగా పరిష్కరించేందుకు ప్రత్యేకంగా ట్రంక్‌లైన్లు నిర్మించారని వివరించారు. వృద్ధులు, సీనియర్ సిటిజన్ల వాకింగ్ కోసం ప్రత్యేకంగా పార్కులు, చిల్డ్రన్స్ ఆడుకునేందుకు వీలుగా చిల్డ్రన్స్ పార్కును కూడా ఏర్పాటు చేశారని తెలిపారు. దశలవారీగా అన్ని కాలనీల అభివృద్ధికి పెద్దపీట వేశారని పేర్కొన్నారు. మరోమారు కారు గుర్తుకు ఓటేసి బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి దేవిరెడ్డి సుధీర్‌రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఆమె వెంట ప్రచారంలో బీఆర్ఎస్ నేతలు రేణుక, కీర్తి, కళా, స్వప్న ఉన్నారు.
మన్సూరాబాద్, అక్టోబర్ 30: కాంగ్రెస్, బీజేపీ లు ఎన్ని కుట్రలు చేసినా బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి విజయాన్ని అడ్డుకోలేరని నాగోల్ డివిజన్ బీఆర్ఎస్ అధ్యక్షుడు తూర్పాటి చిరంజీవి తెలిపారు. బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డికి మద్దతుగా సోమవారం నాగోల్ డివిజన్ పరిధి సెవన్హిల్స్కాలనీలో బీఆర్ఎస్ శ్రేణులు ఇంటింటా ప్రచారం నిర్వహించి కారు గుర్తుకు ఓటు వేయాలని ప్రజలను అభ్యర్థించారు. ఈ సందర్భంగా తూర్పాటి చిరంజీవి మాట్లాడుతూ వేలాది కోట్లతో ఎల్బీనగర్ రూపురేఖలు మార్చిన ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డికే ఓటు వేస్తామని ప్రజలు వాగ్దానం చేస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో గడ్డిఅన్నారం మార్కెట్ కమిటీ మాజీ డైరెక్టర్ కత్తుల రాంబాబు, నాయకులు సతీశ్‌యాదవ్, గవ్వ శ్యాంసుందర్‌రెడ్డి, రవి, ప్రమీల, సుర్వి రాజుగౌడ్, సాయి పాల్గొన్నారు.
మన్సూరాబాద్, అక్టోబర్ 30: మహవీర్ హరిణ వనస్థలి నేషనల్ పార్కులో మార్కింగ్ వాక్ చేసే వాకర్స్ సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తానని బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి తెలిపారు. నవంబర్ 30న జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో తనకు మద్దతు తెలపాలని కోరుతూ సోమవారం ఆయన ఆటోనగర్‌లోని హరిణ వనస్థలి నేషనల్ పార్కులో మార్నింగ్ వాక్ చేసే వాకర్స్‌ను కోరారు. వాకర్స్ అసోసియేషన్ సభ్యులు బీఆర్ఎస్ అభ్యర్థి దేవిరెడ్డి సుధీర్‌రెడ్డికి తమ సంపూర్ణ మద్దతు తెలిపారు. రాబోయే ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలిపిస్తామని హామీ నిచ్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి మాట్లాడుతూ వాకర్స్ కోసం మహవీర్ హరిణ వనస్థలి నేషనల్ పార్కులో ఓపెన్ జిమ్ ఏర్పాటుకు గతంలోనే నిధులు మంజూరు కావడం జరిగిందని తెలిపారు. ఫారెస్ట్ అధికారుల అనుమతులు లేకపోవడం వలన ఓపెన్ జిమ్ ఏర్పాటు చేయలేకపోయామని తెలిపారు. అటవీశాఖ అధికారుల అనుమతి తీసుకుని ఓపెన్ జిమ్‌ను ఏర్పాటు చేయిస్తానన్నారు. మహవీర్ హరిణ వనస్థలి నేషనల్ పార్కును మరింతగా ఆధునీకరిస్తామని తెలిపారు. కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ కొప్పుల విఠల్‌రెడ్డి, వాకర్స్ సభ్యులు విజేందర్‌రెడ్డి, గుత్తా లక్ష్మణ్‌రెడ్డి, శ్రావణ్, సునీల్, సుధీర్, ఉమేశ్, జగదీశ్‌యాదవ్ తదితరులు పాల్గొన్నారు.