మన్సూరాబాద్, జూలై 2: సోషల్ మీడియా పై ఆధారపడి బ్రతకడమే తప్ప సమాజం కోసం బీజేపీ చేసిందేమీ లేదని ఎంఆర్డీసీ చైర్మన్, ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి తెలిపారు. మన్సూరాబాద్ డివిజన్ పరిధి హిమపురి కాలనీలో ఆదివారం సాయంత్రం ఎల్బీనగర్ నియోజకవర్గం బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు జక్కిడి రఘువీరారెడ్డి ఆధ్వర్యంలో పలువురి చేరిక జరిగింది. భువనగిరి శశిధర్ నేత మరో 150 మంది వివిధ పార్టీలకు చెందిన నాయకులతో కలిసి ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి మాట్లాడుతూ బీజేపీ దేశానికి, ప్రజలకు చేసిందేమీ లేదని, తప్పుడు ప్రచారాలు, బూటకపు మాటలతో ప్రజలను మభ్య పెట్టి అడ్డదారిలో అధికారంలోకి రావాలని చూస్తున్నదని తెలిపారు. ఎల్బీనగర్లో కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే కనుమరుగైనదని, ఫ్లెక్సీలు, పోస్టర్లు వేసి తాము ఉన్నామని చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నదని తెలిపారు. కాంగ్రెస్, బీజేపీలు ప్రజల విశ్వాసాన్ని కోల్పోయాయని, వారు ఎన్ని జిమ్మిక్కులు చేసినా ప్రయోజనం ఉండదని తెలిపారు.
సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ హైదరాబాద్ నగరానికి ప్రపంచ స్థాయిలో గుర్తింపు తీసుకువచ్చారని తెలిపారు. అంతకు ముందు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఇటీవల గుండెపోటుతో మృతిచెందిన తెలంగాణ గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్, ధూంధాం కళాకారుడు సాయిచంద్ చిత్రపటానికి ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డితో పాటు నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ కొప్పుల విఠల్‌రెడ్డి, డివిజన్ బీఆర్ఎస్ అధ్యక్షుడు జక్కిడి రఘువీర్‌రెడ్డి, నాయకులు పోచబోయిన ఈశ్వరమ్మ యాదవ్, పోచబోయిన జగదీష్ యాదవ్, టంగుటూరి నాగరాజు, విజయభాస్కర్‌రెడ్డి, ఏలుకొండ రాంకోటి, రామాచారి, నవీన్, అరుణ్ పాల్గొన్నారు. అదే విధంగా పార్టీలో చేరిన వారిలో కర్ణ, జానీ, సాయి వెంకట్, సురేష్, సుధీర్, సాయికాంత్, మణికంఠ, శివ, జి. శ్రీకాంత్, వినోద్, అంజి, మల్లికార్జున్, మహేష్‌యాదవ్, గోపి తదితరులు ఉన్నారు.
బీఆర్ఎస్లో చేరిన కాంగ్రెస్ నేతలు
బాలానగర్ డివిజన్ ఇంద్రానగర్‌కు చెందిన యాదవ సంఘం సభ్యులు, ఇంకా కాంగ్రెస్ పార్టీ సభ్యులు మొత్తం 60 మంది కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఆధ్వర్యంలో ఆదివారం బీఆర్ఎస్లో చేరారు. బాలానగర్ డివిజన్ ఇంద్రానగర్‌కు చెందిన యాదవ సంఘం సభ్యులు, కాంగ్రెస్ పార్టీకి చెందిన సభ్యులు కూకట్‌పల్లిలోని ఎమ్మెల్యే కృష్ణారావు క్యాంపు కార్యాలయానికి వెళ్లి ఆయన సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వారికి గులాబీ కండువాలు కప్పి బీఆర్ఎస్లోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో వెంకట్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
– బాలానగర్, జూలై 2
ఆజంపురాలో బీఆర్ఎస్లోకి మహిళల చేరిక
చాదర్‌ఘాట్, జూలై 2: ఆదివారం ఆజంపురాలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో పాత నగరానికి చెందిన కొంతమంది మహిళలు తలాబ్ చంచలం డివిజన్ అధ్యక్షురాలు నర్జిస్ భాను, రజా అలీ మిర్జా నేతృత్వంలో రాష్ట్ర హోం మంత్రి మహమూద్ అలీ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. పార్టీలో చేరిన వారికి హోంమంత్రి మహమూద్ అలీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. కార్యక్రమంలో మలక్‌పేట నియోజకవర్గం ప్రధాన కార్యదర్శి లాయక్ అలీ, ఫాతిమా, నదీరా, నస్రీన్ బేగం, నుస్రత్ ఫాతిమా, అక్బర్ అలీ, సాజిద్ అలీ, అబ్బాస్ హస్సేన్, అక్రం అలీ తదితరులు పాల్గొన్నారు.
అంబర్‌పేటలో..
అంబర్‌పేట నియోజకవర్గంలో వివిధ పార్టీల నుంచి కీలక నేతల చేరికలు ఇటీవల భారీగా కొనసాగుతున్నాయి. తాజాగా ఆదివారం అంబర్‌పేట గోల్నాక క్యాంపు కార్యాయలం వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో బాగ్ అంబర్‌పేట డివిజన్ బతుకమ్మ కుంటకు చెందిన డివిజన్ బీజేపీ ఎడ్యుకేషన్ సెల్ కన్వీనర్ చంద్రశేఖర్ రావు అలియాస్ ట్యూషన్ శేఖర్‌తో పాటు స్థానిక బీజేపీ ముఖ్య నాయకులు రవి, విజయ్ కుమార్, పి.కృష్ణ, శశికాంత్, వి.రాజేశ్‌తో పాటు మరో 30 మంది నాయకులు బీఆర్ఎస్ పార్టీలోకి చేరారు. వీరికి ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షుడు చంద్రమోహన్, సీనియర్ బీఆర్ఎస్ నాయకులు పులిజాల గెల్వయ్య, మోర శ్రీరాములు ముదిరాజ్, నరసింహారెడ్డి, మిరియాల రవీందర్, బాలరాజు, రమేశ్ నాయక్‌తో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు.
– గోల్నాక, జూలై 2