Danam Nagender | హైదరాబాద్ : టాలీవుడ్ నటుడు అల్లు అర్జున్ విడుదలపై ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కీలక వ్యాఖ్యలు చేశారు. అల్లు అర్జున్ జైలు నుంచి విడుదల అవడంతో.. ఆయనకు న్యాయం జరిగిందన్నారు. అల్లు అర్జున్ను అరెస్టు చేయడం కొంత బాధ కలిగించిందన్నారు.
అల్లు అర్జున్ ప్యాన్ ఇండియా హీరోనే కాదు ప్రపంచ హీరో అని దానం అన్నారు. ఆయన మాకు బంధువు కూడా అవుతారు.
అల్లు అర్జున్ను అరెస్ట్ చేయడంతో విచారం వ్యక్తం చేశాను. మొత్తానికి బెయిల్ దొరకడం సంతోషకరం. అల్లు అర్జున్ జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు గుర్తింపు తెచ్చారు. ఆయన సినిమాలను ప్రపంచ వ్యాప్తంగా ఆదరిస్తున్నట్లు మీడియా ద్వారా తెలిసింది. ఏదేమైనప్పటికీ అర్జున్ అరెస్ట్ కావడం దురదృష్టకరమైన సంఘటనగా నేను భావిస్తున్నానని దానం నాగేందర్ వ్యాఖ్యానించారు.
అల్లు అర్జున్ అరెస్ట్ పై స్పందించిన ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్
అల్లు అర్జున్ ప్యాన్ ఇండియా హీరోనే కాదు ప్యాన్ వరల్డ్ హీరో
హీరో అల్లు అర్జున్ మా బంధువు
అల్లు అర్జున్ అరెస్ట్ కావడం బాధాకరం
అల్లు అర్జున్ ను అరెస్ట్ చేయడంతో విచారం వ్యక్తం చేస్తున్నాను
మొత్తానికి బెయిల్… pic.twitter.com/se9UDe5h33
— Telugu Scribe (@TeluguScribe) December 14, 2024
ఇవి కూడా చదవండి..
KTR | ఇలా మీ కుటుంబంలో జరిగితే.. అంగీకరించగలరా రాహుల్ జీ..? : కేటీఆర్
LK Advani | అద్వానీకి ఐసీయూలో చికిత్స : అపోలో వైద్యులు