హైదరాబాద్ : కొద్ది రోజులు హైదరాబాద్ నగరంలో హైడ్రా పేరుతో నిరుపేదల ఇండ్లను అమానవీయంగా కూల్చివేస్తున్న(HYDRAA demolitions) సంఘటనపై ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్(MLA Danam Nagender) సంచలన ఆరోపణుల చేశారు. మూసీ పరీవాహకంలో(Musi river) కూల్చివేతలపై ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ఎలాంటి ప్రత్యామ్నా మార్గాలు చూపకుండా పేదల ఇండ్లను కూల్చి వేయడం సరికాదన్నారు. నగరంలో జలవిహార్, హైమ్యాక్స్ లాంటివి ఎన్నో అక్రమ కట్టడాలు చాలా ఉన్నాయి.
అలాంటి వాటిని వదిలిపెట్టి సామాన్యుల ఇండ్లను కూల్చడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. మూసీ పరీవాహక ప్రాంతంలో ఇండ్లకు రెడ్ మార్క్ పెట్టం తొందరపాటు చర్యగా అభివర్నించారు. కూల్చిన ఇండ్లకు స్టానికంగానే బాధితులకు వసతి కల్పిస్తే మంచిదని సూచించారు. పేదలు నివసించే స్లమ్ జోలికి వెళ్లొద్దని తాను ముందే చెప్పానని గుర్తు చేశారు.