బంజారాహిల్స్,నవంబర్ 25: పేద ప్రజలకు సంక్షేమ పథకాలు అందిస్తూనే అభివృద్ధి కార్యక్రమాల్లో కూడా రాష్ట్రం నెంబర్‌వన్‌గా ఉందని ఎమ్మెల్యే దానం నాగేందర్ అన్నారు. ఖైరతాబాద్ నియోజకవర్గంలోని వివిధ డివిజన్లలో రూ.1.40కోట్ల వ్యయంతో చేపట్టిన అభివృద్ధి పనులను ఎమ్మెల్యే దానం నాగేందర్ శుక్రవారం ప్రారంభించారు. జూబ్లీహిల్స్ డివిజన్ పరిధిలోని గాయత్రీహిల్స్‌లో రూ.80లక్షల వ్యయంతో సీసీ రోడ్డు పనులను స్థానిక కార్పొరేటర్ వెల్దండ వెంకటేశ్‌తో కలిసి ఎమ్మెల్యే దానం నాగేందర్ ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గాయత్రీహిల్స్‌లో సీవరేజీ సమస్యలు పరిష్కరించేందుకు ఇటీవల రూ.40లక్షల వ్యయంతో పనులు చేపట్టామన్నారు.
సీవరేజ్లైన్లు పూర్తయిన ప్రాంతాల్లో కొత్త రోడ్లు వేయాలని నిర్ణయించడం జరిగిందని, దీనిలో భాగంగా గాయత్రీ హిల్స్‌లో సుమారు రూ.80లక్షలను మంజూరు చేయించామన్నారు. గాయత్రీహిల్స్‌లో ఇండ్ల క్రమబద్ధ్దీకరణ అంశాన్ని ఇటీవల సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లామన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం చేతల ప్రభుత్వమని, ప్రజలకు మేలు చేయడమే ఏకైక ఎజెండాగా పనిచేస్తున్న పార్టీని, ప్రభుత్వాన్ని కూల్చేందుకు కొన్ని దుష్టశక్తులు ప్రయత్నిస్తున్నాయని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో గాయత్రీహిల్స్ అధ్యక్షుడు కే.రాఘవులు, ఉపాధ్యక్షుడు వెంకటేష్ యాదవ్,మల్లేష్ యాదవ్, భరత్‌తో పాటు టీఆర్ఎస్ డివిజన్ నాయకులు విష్ణునాయక్, పెరుక కిరణ్‌కుమార్,సునీల్ తదితరులు పాల్గొన్నారు.
వెంకటేశ్వరకాలనీలో..
వెంకటేశ్వరకాలనీ డివిజన్ పరిధిలోని దూద్‌ఖానా బస్తీలో రూ.18లక్షల వ్యయంతో చేపట్టిన సీసీ రోడ్డుపనులను ఎమ్మెల్యే దానం నాగేందర్ స్థానిక కార్పొరేటర్ మన్నె కవివితారెడ్డితో కలిసి ప్రారంభించారు. ఇప్పటికే సీవరేజ్ పనులు పూర్తయిన అన్ని వీధుల్లో సీసీ రోడ్లు వేయిస్తామని హా మీ ఇచ్చారు. ఈ క్రమంలో డివిజన్ టీఆర్ఎస్ అధ్యక్షుడు రాములు చౌహాన్, జీహెచ్ఎంసీ సర్కిల్ 18 డీఎంసీ రజినీకాంత్‌రెడ్డి. ఈఈ విజయ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
పోచమ్మబస్తీల్లో ..
ఖైరతాబాద్ : సోమాజిగూడ డివిజన్లోని పోచమ్మబస్తీలో రూ.49లక్షలతో సీవరేజీ లైను పనులను ఎమ్మెల్యే దానం నాగేందర్, జీహెచ్ంఎసీ స్టాండింగ్ కమిటీ సభ్యురాలు, కార్పొరేటర్ వనం సంగీత శ్రీనివాస్ యాదవ్‌తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సీవరేజీ లైన్లు పూర్తి కాగానే, త్వరలోనే వీడీసీసీ రోడ్ల పనులు కూడా ప్రారంభిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో హైదరాబాద్ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్ పర్సన్ కె. ప్రసన్నరాంమ్మూర్తి, వాటర్ వర్క్ జీఎం హరిశంకర్, డీజీఎం శ్రీనివాస్, మేనేజర్ మమత, టీఆర్ఎస్ డివిజన్ అధ్యక్షుడు ఎస్కె అహ్మ ద్, మాజీ కార్పొరేటర్ లక్ష్మీనారాయణమ్మ పాల్గొన్నారు.