BRS | మల్కాజిగిరిలో ‘రాగిడి’ని గెలిపించుకుందాం
మల్కాజిగిరి పార్లమెంట్లో రాగిడి లక్ష్మారెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించుకుందామని మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి అన్నారు. బీఆర్ఎస్ మల్కాజిగిరి ఎంపీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి, మాజీ మేయర్ మేకల కావ్యతో కలిసి పార్టీ అధ్యక్షుడు కొండల్ ముదిరాజ్ ఆధ్వర్యంలో సోమవారం జవహర్నగర్ కార్పొరేషన్లో ప్రచారం నిర్వహించారు.
- మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి
BRS | జవహర్నగర్, ఏప్రిల్ 29: మల్కాజిగిరి పార్లమెంట్లో రాగిడి లక్ష్మారెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించుకుందామని మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి అన్నారు. బీఆర్ఎస్ మల్కాజిగిరి ఎంపీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి, మాజీ మేయర్ మేకల కావ్యతో కలిసి పార్టీ అధ్యక్షుడు కొండల్ ముదిరాజ్ ఆధ్వర్యంలో సోమవారం జవహర్నగర్ కార్పొరేషన్లో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మల్లారెడ్డి మాట్లాడుతూ.. పార్టీ కార్యకర్తలు చూస్తుంటే సంతోషంగా ఉందని, శాసనసభ ఎన్నికల్లో కనిపించిన జోరునే.. పార్లమెంట్ ఎన్నికల్లోనూ కనబర్చాలని సూచించారు.
రాగిడి లక్ష్మారెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలన్నారు. బీఆర్ఎస్ హయాంలో జరిగిన అభివృద్ధే కనిపిస్తుందని, కాంగ్రెస్ ప్రభుత్వం చేసిందేమీ లేదని ఎద్దేవా చేశారు. పలు డివిజన్లలో ప్రచారం చేస్తూ.. బీఆర్ఎస్ పార్టీ కారు గుర్తుకు ఓటు వేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు జిట్టా శ్రీవాణిశ్రీనివాస్రెడ్డి, మేక లలితాయాదవ్, సంగీతారాజశేఖర్, సతీశ్కుమార్, నాయకులు సుధాకర్చారి, సింగన్న బాల్రాజ్, ప్రకాశ్, సాధిక్, ప్రసాద్గౌడ్, సోషల్ మీడియా కన్వీనర్ అహ్మద్పాషా, మహిళలు పాల్గొన్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

