మేడ్చల్ రూరల్, జనవరి 28: ధనిక రాష్ట్రంగా ఉన్న తెలంగాణను కాంగ్రెస్ సర్కార్ దివాలా రాష్ట్రంగా మారుస్తోందని మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి విమర్శించారు. ఎల్లంపేట మున్సిపల్ పరిధిలోని ఎల్లంపేట, లింగాపూర్ గ్రామాల్లో బుధవారం ఆయన పర్యటించారు. మున్సిపల్ ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటు వేసి బీఆర్ఎస్ పార్టీ బలపర్చిన అభ్యర్థులను గెలిపించాలని ఓటర్లను కోరారు. మూడు మున్సిపాలిటీల్లో బీఆర్ఎస్ కౌన్సిలర్లు భారీ మెజార్టీతో గెలుపొంది చైర్మన్ పీఠం దక్కుంచుకుకోవడం ఖాయమని అన్నారు. ఈ సందర్భంగా లింగాపూర్ గ్రామంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన బత్తుల కృష్ణ, వరిగంటి నాగులు తదితరులు బీఆర్ఎస్లో చేరగా వారికి ఎమ్మెల్యే కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జ్ లక్ష్మారెడ్డి, మేడ్చల్ నియోజకవర్గ ఇన్చార్జ్ మహేందర్‌రెడ్డి, మున్సిపల్ ఎన్నికల ఇన్చార్జ్ వెంకట్‌రెడ్డి, మేడ్చల్ మండల పార్టీ అధ్యక్షుడు దయానంద్ యాదవ్, మేడ్చల్ మున్సిపల్ అధ్యక్షుడు భాస్కర్ యాదవ్, మాజీ సర్పంచ్ లక్ష్మీ సంజీవ, నాయకులు.. రాజమల్లారెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, సుదర్శన్, పెంటయ్య, రాగజ్యోతి, మోహన్‌రెడ్డి, సంజీవ, యూనుస్ పాష తదితరులు పాల్గొన్నారు.
శామీర్ పేట, జనవరి 28: మేడ్చల్ నియోజకవర్గ అభివృద్ధి, ప్రజా సంక్షేమం బీఆర్ఎస్తోనే సాధ్యమని మాజీ మంత్రి, ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి అన్నారు. గత పాలనలో అమలైన సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి పనులకు ఆకర్షితులై లాల్‌గడి మలక్‌పేటకు చెందిన కాంగ్రెస్ సీనియర్ నాయకుడు ఆళ్ల నర్సింహారెడ్డి, మాజీ సర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో పలువురు నాయకులు బీఆర్ఎస్ పార్టీలో చేరారు.
ఎమ్మెల్యేలు చామకూర మల్లారెడ్డి, మర్రి రాజశేఖర్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీలో చేరినవారికి గులాబీ కండువా కప్పి స్వాగతం పలికారు. మర్రి రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ..మేడ్చల్మలాజిగిరి ప్రాంతాల్లో అభివృద్ధి పనులను మరింత వేగవంతం చేస్తామని, చేరిన నాయకులు పార్టీ బలోపేతానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నేమురి నాగేశ్, వేముల హరిబాబు, ఆకుల వెంకటేష్, ఉప్పల నవీన్, ఆళ్ల నరేష్ రెడ్డి, ఉప్పల అశోక్, మచ్చ అశోక్, బీఆర్ ఎస్ గ్రామ అధ్యక్షుడు బండి రవి, జనరల్ సెక్రటరీ మురళి తదితరులు పాల్గొన్నారు.
మేడ్చల్ నియోజకవర్గం మూడుచింతలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని కేశ్వపూర్ గ్రామంలో వార్డు నం 10 బీఆర్ఎస్ అభ్యర్థి మాధవరెడ్డికి మద్దతుగా ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి ఆధ్వర్యంలో బుధవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గడపగడపకు తిరుగుతూ బీఆర్ఎస్ అభ్యర్థికి ఓటు వేయాలని ఓటర్లను అభ్యర్థించారు.
అనంతరం గ్రామంలో నిర్వహించిన కార్నర్ మీటింగ్లోఎమ్మెల్యే మల్లారెడ్డి మాట్లాడుతూ.. అభివృద్ధిసంక్షేమం బీఆర్ఎస్ అజెండా అని.. అదే నమ్మకంతో ప్రజలు మరోసారి బీఆర్ఎస్కు అవకాశం ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఇన్చార్జ్ గజ్జెల నాగేశ్, యువ నాయకులు డా.భద్రారెడ్డి, మధుకర్ రెడ్డి, కార్యకర్తలు పాల్గొన్నారు.