HomeHyderabadMla Candidate Lasya Nandita Said That Everyone Is Supporting The Brs Party
ప్రతిపక్షాల మాయమాటలు నమ్మి మోసపోవద్దు
సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గంలో ప్రతి ఒక్కరూ గులాబీ పార్టీకే మద్దతు పలుకుతున్నారని బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి లాస్యనందిత అన్నారు. ఇతర పార్టీల మాయమాటలను ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్నారు.
ఎవరెన్ని కుట్రలు చేసినా బీఆర్ఎస్దే గెలుపు
బీఆర్ఎస్ అభ్యర్థికి మద్దతు తెలిపిన విభిన్న వర్గాల ప్రజలు
ప్రజలంతా కారువైపే
బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి లాస్యనందిత
కంటోన్మెంట్/బొల్లారం, నవంబర్ 14: సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గంలో ప్రతి ఒక్కరూ గులాబీ పార్టీకే మద్దతు పలుకుతున్నారని బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి లాస్యనందిత అన్నారు. ఇతర పార్టీల మాయమాటలను ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్నారు. రోజుకో పార్టీ, పూటకో మాట మాట్లాడే నాయకులకు ప్రజలే తగిన బుద్ధి చెప్పడం ఖాయమన్నారు. ఎవరెన్ని కుట్రలు చేసినా అంతిమంగా న్యాయమే విజయం సాధిస్తుందని… కంటోన్మెంట్లో బీఆర్ఎస్ మాత్రమే భారీ మెజార్టీతో ఘన విజయం సాధిస్తుందని స్పష్టం చేశారు. మంగళవారం కంటోన్మెంట్ నియోజకవర్గానికి చెందిన పలు విభిన్న వర్గాల ప్రజలు కార్ఖానాలోని దివంగత ఎమ్మెల్యే సాయన్న నివాసానికి తరలివచ్చారు.
లాస్యనందితను మర్యాదపూర్వకంగా కలుసుకొని సంపూర్ణ మద్దతు ప్రకటించారు. బడుగు, బలహీనవర్గాలతో పాటు మైనార్టీలు, వృద్ధులు, మహిళలు.. ఇలా అన్నివర్గాల ప్రజలు ఆమెకు మద్దతు తెలపడంతో పాటు బీఆర్ఎస్ వెంటే ఉంటామంటూ నినదించారు. జై కేసీఆర్, జోహార్ సాయన్న నినాదాలతో హోరెత్తించారు. ఈ సందర్భంగా కంటోన్మెంట్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి లాస్యనందిత మాట్లాడుతూ పథకాల పార్టీ అయిన బీఆర్ఎస్ కావాలో లేక ప్రజల మధ్య వైషమ్యాలు రేపే ఇతర విపక్ష పార్టీలు కావాలో తేల్చుకోవాలన్నారు. ఈ ఆత్మీయ భేటీలో కంటోన్మెంట్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి లాస్యనందిత పాటు పార్టీ నాయకురాలు నివేదిత, పలువురు సీనియర్ నాయకులు, ఉద్యమకారులు తదితరులు పాల్గొన్నారు.
తిరుమలగిరిలో…
కంటోన్మెంట్ ఏడో వార్డు తిరుమలగిరి విలేజ్ బస్తీలో వార్డు అధ్యక్షుడు తేజ్‌పాల్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ అభ్యర్థి లాస్య నందితకు మద్దతుగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కార్యక్రమంలో శత్రు,శ్రీవర్ధన్,శాంతమూర్తి, వీరమణి,కురుమయ్య,కుమార్ తదితరులు పాల్గొన్నారు.
ఎనిమిదో వార్డు బొల్లారం చింతల్ బజార్లో..
కంటోన్మెంట్ బొల్లారం,తిరుమలగిరిలో బీఆర్ఎస్ అభ్యర్థి లాస్య నందితకు మద్దతుగా ఎనిమిదో వార్డు బొల్లారం చింతల్ బజార్లో బోర్డు మాజీ సభ్యుడు లోక్‌నాథ్,మార్కెట్ వైస్ చైర్మన్ వేణు గోపాల్‌రెడ్డి ఆధ్వర్యంలో చింతల్ బజార్,టీఐటీ బ్లాక్,డౌటన్ బజార్ లో ఇంటింటికెళ్లి బీఆర్ఎస్ మ్యానిఫెస్టోను వివరిస్తూ ఓట్లు అభ్యర్థించారు.దివంగత నేత సాయన్న కుమార్తె లాస్య నందిత కారు గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు.ఈ కార్యక్రమంలో వార్డు అధ్యక్షుడు కేజీ రవి కుమార్,విక్టర్,మురళీ యాదవ్,ఈఆర్ బాల్‌రాజు,ఎర్రోళ్ల గిరి,మిలిట్రీ రమేష్,శంకర్ సింగ్, సతీష్, ఎచ్ఎన్.శ్రీనివాస్,ప్రవీణ్,అజాం,సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.