రామంతాపూర్,అక్టోబర్ 2 : హైడ్రా బాధితులకు(Hydraa victims) తాము అండగా ఉంటామని ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి(MLA Bandari Lakshmareddy) అన్నారు. బుధవారం రామంతాపూర్‌లోని కేసీఆర్ నగర్ మూసీ పరివాహాకం ప్రాంతాల్లోని బాధితుల ఇండ్లను పరిశీలించారు. ఈ సందదర్భంగా ఆయన మాట్లాడూతూ.. మూసీ బాధితుల కోసం బీఆర్ఎస్ తరఫున న్యాయపోరాటం చేస్తామన్నారు. తెలంగాణ ప్రజలకు ఏ కష్టమొచ్చినా గుర్తు వచ్చేది బీఆర్ఎస్ పార్టేనని పేర్కొన్నారు.
ఒక్క ఫోన్ చేస్తే చాలు తామంతా వచ్చి మీకు అండగా ఉంటామని స్పష్టం చేశారు. హైడ్రా పేద ప్రజల పాలిట శాపంగా మారిందన్నారు. కాంగ్రెస్ అసమర్ద పాలనతో ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారని విమర్శించారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ గంధం జ్యోత్స్న, రాష్ట్ర నాయకులు పసుల ప్రభాకర్‌రెడ్డి, సర్వబాబు యాదవ్, జహంగీర్, చాంద్‌పాషా, సూరం శంకర్, స్వామి, నరేశ్, మనీశ్, శ్రీనివాస్‌రెడ్డి, సాగర్, మహేందర్, సంధ్య, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.