హైదరాబాద్ : ఉప్పల్ నియోజకవర్గ పరిధిలోని ఆలయాలను(Temples) అభివృద్ధి చేసేందుకు తన వంతు కృషి చేయనున్నట్లు ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి(MLA Bandari Lakshmareddy) పేర్కొన్నారు. ఆదివారం చర్లపల్లి డివిజన్ పరిధిలోని ఆదర్శనగర్‌లో నిర్వహించిన దుర్గమ్మ బోనాల పండుగలో బండారి లక్ష్మారెడ్డి పాల్గొన్ని ఆమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వచ్చే ఆశాఢ మాస బోనాల పండుగకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు.
ఆదర్శనగర్‌లో బోనాల పండుగ సందర్భంగా ఏర్పాట్లు పూర్తి చేశామని, వచ్చే బోనాల పండుగ సందర్భంగా ఆలయాల వద్ద సౌకర్యాలు కల్పించడంతో పాటు రహదారుల నిర్మాణం, పారిశుద్ద్య పనులను వేగవంతం చేస్తామని ఆయన తెలిపారు. అనంతరం ఆలయ కమిటీ ప్రతినిధులు ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డిని సన్మానించారు. ఈ కార్యక్రమంలో నాయకులు నేమూరి మహేశ్‌గౌడ్, నాయకులు కంచుగట్ల మల్లేశ్ వంశరాజు, కొమ్ము ఉపేందర్, మత్స్య గిరి, నర్సింహ్మ, యాదగిరి, గణేశ్ ఉత్సవ కమిటి సభ్యులతో పాటు పెద్ద సంఖ్యలో కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు.