రామంతాపూర్, అక్టోబర్ 20 : ఎంబీబీఎస్(MBBS students) విద్యార్థులకు బీఎల్ఆర్ ట్రస్టు ఎప్పడూ అండగా ఉంటుందని ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి(MLA Bandari) అన్నారు. విద్యా దీవెన పథకంలో భాగంగా ఆదివారం రామంతాపూర్ గోఖలేనగర్కు చెందిన నెల్లి విరోనికా, శ్రీరామాకాలనీకి చెందిన పల్లెపు వైష్ణవి ఎంబీబీఎస్ సీట్లు సాధించి ఫీజు కట్టలేక ఇబ్బందులు పడుతున్న వారికి ట్రస్టు అండగా నిలిచింది. ఈ మేరకు ఎమ్మెల్యే వారి ఇంటికి వెళ్లి ఫీజుకు సంబంధించిన చెక్కులను అందజేశారు.
అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఉప్పల్ నియోజకవర్గంలో ఫీజులు కట్టలేక ఇబ్బంది పడుతున్నా ఎంబీబీఎస్ విద్యార్థులు అందరికి తానే కడుతానన్నారు. వైద్య వృత్తిలో కొనసాగే పేదింటి పిల్లలకు నిరంతరం అండగా ఉంటామన్నారు. ఈ కార్యక్రమంలో పార్లమెంట్ బీఆర్ఎస్ ఇన్చార్జి రాగిడి లక్ష్మారెడ్డి, మాజీ కార్పొరేటర్ గంధం జ్యోత్స్న, పసుల ప్రభాకర్‌రెడ్డి, సర్వబాబు యాదవ్, శ్రీకాంత్‌గౌడ్, మధుసూదన్‌రెడ్డి, సూరం శంకర్, జహంగీర్, శ్రీనివాస్‌రెడ్డి, చాంద్‌పాషా, ప్రశాంత్‌గౌడ్, రాజు యాదవ్, శ్రీనివాస్‌రెడ్డి, లక్ష్మి, శ్రీనివాస్, విజయలక్ష్మి, శ్రీను, ఆనంద్, టోని, తదితరులు పాల్గొన్నారు.