ఉప్పల్, జూన్ 25 : ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు అండగా ఉంటూ తగిన చేయుతనందిస్తామని ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి(MLA Bandari Lakshmareddy )అన్నారు. ఉప్పల్ నియోజకవర్గంలోని హబ్సిగూడ ప్రభుత్వ పాఠశాలలో కాలేరు యమునాబాయి ట్రస్టు ఆధ్వర్యంలో కాలేరు జైనవీన్ సహకారంతో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు స్టడీ మెటీరియల్(Study material )పంపిణీ చేపట్టారు. ఈ కార్యక్రమానికి ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి హాజరయ్యారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ట్రస్టు ద్వారా సేవలు అందించడం అభినందనీయమన్నారు.
పాఠశాలలో సమస్యల సత్వర పరిష్కారానికి చర్యలు చేపడతామన్నారు. మరోసారి పాఠశాలను సంద ర్శిస్తానని హామీనిచ్చారు. నియోజకవర్గ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడానికి నిరంతరం అందుబాటులో ఉంటామన్నారు. ఈ కార్యక్రమంలో నేతలు పసుల ప్రభాకర్‌రెడ్డి, గంధం నాగేశ్వర్రావు, మహేష్‌గౌడ్, కాలేరు సుధాకర్, అజిత్‌రెడ్డి, సురం శంకర్, చాంద్‌పాషా, బోసాని పవన్, అద్విత్, శ్యామ్, నాని, చందు, లక్ష్మణ్‌రావు, లక్ష్మి పాల్గొన్నారు.