ఉప్పల్, జూలై 9 : మహిళలకు అండగా ఉంటూ, తనవంతు తోడ్పాటు అందిస్తామని ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి(MLA Bandari Lakshmareddy) అన్నారు. ఉప్పల్ (Uppal) మండల పరిధిలోని కల్యాణలక్ష్మి( Kalyanalakshmi), షాదీముబారక్ చెక్కుల పంపిణీ మంగళవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఉప్పల్ ఎమ్మెల్యే హాజరై చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కష్టాల్లో ఉన్నవారికి కుటుంబపెద్దగా ముందుంటానని తెలిపారు.
అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు కొనసాగుతుంటాయని, ప్రజలు వాటిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అదేవిధంగా నియోజకవర్గంలోని ప్రజలకు విద్యా, వైద్యం అందించడానికి తనవంతు సహకారం అందిస్తామన్నారు. ప్రజల కోసం పనిచేయడానికి నిరంతరం అందుబాటులో ఉంటానని హామీనిచ్చారు. కాలనీవాసుల అవసరాలు గుర్తించి, పనులు చేపడుతున్నామని తెలిపారు.
గత ప్రభుత్వం అందిస్తున్న కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలను కాంగ్రెస్ ప్రభుత్వం కొనసాగిం చాలన్నారు. వీటితోపాటు మహిళలకు ఇస్తామని చెప్పిన తులం బంగారం అందించాలన్నారు. ఈ కార్యక్రమంలో జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ మెంబర్ బన్నాల గీతాప్రవీణ్ ముదిరాజ్, కార్పొరేటర్లు శాంతిసాయిజెన్ శేఖర్, పన్నాల దేవేందర్‌రెడ్డి, జెర్రిపోతుల ప్రభుదాస్, తదితరులు పాల్గొన్నారు.