రామంతాపూర్,జనవరి 23 : క్రీడాపోటీలు యువత క్రీడా స్ఫూర్తిని పెంపొందిస్తాయని ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి అన్నారు. మాజీ కార్పొరేటర్ గంధం జ్యోత్స్న, బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు గంధం నాగేశ్వర్రావు ఆధ్వర్యంలో రామంతాపూర్ చిన్నచెరువులో ఏర్పాటు చేసిన బీఎల్ఆర్ క్రికెట్ పోటీలను ఆయన లాంఛనంగా ప్రారంభించారు. పోటీలలో పాల్గొనే క్రీడాకారులను పరిచయం చేసుకున్నారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. యువత క్రీడలపై మరింత ఆసక్తి పెంచుకోవాలన్నారు.
ఈక్రీడల వలన శారీరక ధారుఢ్యాన్ని పెంచడమే కాకుండా మానసిక ఉల్లాసాన్ని పెంచుతాయన్నారు. అనంతరం గంధం నాగేశ్వర్రావు మాట్లాడుతూ క్రికెట్ పోటీలకు పరిసర ప్రాంతాలకు చెందిన క్రీడాకారులు ఉత్సాహంగా ముందుకువచ్చారన్నారు. ఈనెల .25 తేదీ వరకు క్రీడలు కొనసాగుతాయన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు పసుల ప్రభాకర్‌రెడ్డి, సోమశేఖర్‌రెడ్డి, బాల్‌రాజ్ యాదవ్, ఆకుల మహేందర్, డాక్టర్ బివి చారి, సూరంశంకర్, సంధ్య, మంజుల, తదితరులు పాల్గొన్నారు.