మట్టి విగ్రహాలను ప్రోత్సహించడం అభినందనీయం : ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి
పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యత ఇస్తూ వినాయకచవితి ఉత్సవాల సందర్భంగా మట్టివినాయక విగ్రహాల పంపిణీని ప్రోత్సహించడం అభినందనీయమని ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి అన్నారు.
కాప్రా, సెప్టెంబర్ 1 : పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యత ఇస్తూ వినాయకచవితి ఉత్సవాల సందర్భంగా మట్టివినాయక విగ్రహాల పంపిణీని ప్రోత్సహించడం అభినందనీయమని ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి అన్నారు. మంగళవారం ఉప్పల్‌కు చెందిన సహాయ ఫౌండేషన్ చైర్మన్ ఆకుల మహేందర్ ఎమ్మెల్యే బండారిలక్ష్మారెడ్డిని సైనిక్‌పురిలోని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి మట్టి వినాయకుడిని అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మట్టివినాయకులను పూజించడం ద్వారా పండుగ సంప్రదాయాలను కొనసాగించడంతో పాటు పర్యావరణానికి కూడా మేలు కలుగుతుందని అన్నారు.
మట్టివినాయక విగ్రహాలను ప్రోత్సహించి పంపిణీ చేయడం అందరి బాధ్యత అని ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి అన్నారు. దేవుళ్లలో ఆది దేవుడు, విఘ్నాలను తొలగించే విఘ్నేశ్వరుడు, భక్తుల కోరికలను తీర్చే గణనాథుడు శ్రీవినాయకుడి ఆశీస్సులతో ఉప్పల్ నియోజకవర్గ ప్రజలందరి జీవితాల్లో ఆనందం, ఆరోగ్యం, శాంతి, సౌభాగ్యం వెల్లివిరియాలని, ప్రతి కుటుంబం సుఖసంతోషాలతో ఉండాలని, విఘ్నేశ్వరుడి ఆశీస్సులు అందరిపై ఉండాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
జగిత్యాల జిల్లాలో విషాదం.. వ్యవసాయ బావిలో పడి ఇద్దరు యువకులు మృతి
Cult | ‘కల్ట్’ వాయిదా పడినట్టేనా .. విశ్వక్ సేన్ సినిమా రిలీజ్‌పై ఇంకా రాని క్లారిటీ!
Viral Video | కాంగ్రెస్‌కు దగ్గరుండి ఓట్లు వేయించిన.. ఇప్పుడు నా చేనే ఎండబెట్టిండ్రు.. నాగర్‌కర్నూల్ జిల్లాలో రైతు గోపాల్ ఆవేదన
Sai Pallavi | జగపతిబాబు షోలో సాయి పల్లవి సందడి.. ‘జయమ్ము నిశ్చయమ్మురా’ రెండో సీజన్ ఎప్పటినుండి అంటే..?
Ramayana | ‘రామాయణ’ రన్‌టైమ్ 3 గంటల 15 నిమిషాలా .. సినిమా నిడివిపై ఆసక్తికర ప్రచారం!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

