మాదాపూర్, జూన్ 3: మియాపూర్ జనప్రియ నగర్ ఫేస్ 5 లో నివాసముంటున్న ప్లాట్ యాజమానులు గతంలో ఎమ్మెల్యే నిధుల కింద కాలనీ లో రోడ్డు నిర్మాణాన్ని చేసుకున్నారు. ఆ కాలనీ కి ఆనుకోని ఉన్న అంబేద్కర్ నగర్ కాలనీ వాసులు జనప్రియ నగర్ ఫేస్ 5 యజమానులు ఏర్పాటు చేసుకున్న రోడ్డును లే అవుట్‌గా చూపించి అక్రమంగా నిర్మాణాలు చేపట్టారు. దీంతో మంగళవారం ఫేస్ 5 బాధితులు జీహెచ్ఎంసీ జోనల్ సిటీ ప్లానర్‌ను కలిసి వినతి పత్రం అందజేశారు.
ఫేస్ 5 లో మొత్తం 650 ప్లాట్ లు ఉండగా ప్లాట్ లను గ్రూప్ హౌసింగ్ పథకం కింద సర్వే నంబర్, 47,48,49 వైడ్ ఎల్ ఆర్ నంబర్ 15512/ ఎంపీ 2హెచ్ / 98 07 హుడా ప్రొసెసింగ్ నంబర్ జీ 129/బీపీ/3350/2000 గుంటల్లో విలేజ్ నందు నిర్మించారు. ఫేస్ 5 స్థలానికి పక్కన ఉన్న కొంతమంది ఇంటి నిర్మాణం చేపట్టి డ్రైనేజీ, నాలా ఆక్రమించి ఫేస్ 6 సరిహద్దు గోడను కూల్చివేసి కాలనీ రోడ్డును తమ కాలనీ రోడ్డుగా చూపి తమ స్థలంలోకి ప్రవేశించి అక్రమంగా నిర్మాణం చేశారు. అధికారులు వారికిచ్చిన బిల్డింగ్ పర్మిషన్, ఆక్యూపెన్సీ సర్టిఫికెట్ ను రద్దు చేయాలని కోరారు. అనుమతులు ఇచ్చిన అధికారులపై చర్యలు తీసుకొని ఫేస్ 5 కాలనీ ని సందర్శించి న్యాయం చేయాలని ఫేస్ 5 కాలనీ ప్రజలు కోరారు.