ఠాణాల సరిహద్దుల్లో స్వల్ప మార్పులు..?
పోలీస్ కమిషనరేట్ల పునర్విభజన పూర్తయినా, ఆయా కమిషనరేట్ల సరిహద్దుల్లో చిన్న చిన్న మా ర్పులు ఉండే అవకాశాలున్నాయని పోలీస్‌శాఖలో చర్చ నడుస్తున్నది. ప్రధానంగా హైదరాబాద్, మల్కాజిగిరి కమిషనరేట్ల మధ్య బేగంపేట్, సికింద్రాబాద్ ప్రాంతాల్లోని కొన్ని పోలీస్స్టేషన్ల పరిధిలోని సరిహద్దుల్లో మార్పులు చోటు చేసుకునే అవకాశాలు లేకపోలేదని పలువురు అధికారులు మాట్లాడుకుంటున్నారు.
- విభజనపై ఇప్పటికే విమర్శలు.. పట్టించుకోని ప్రభుత్వం
సిటీబ్యూరో, ఫిబ్రవరి 9 (నమస్తే తెలంగాణ): పోలీస్ కమిషనరేట్ల పునర్విభజన పూర్తయినా, ఆయా కమిషనరేట్ల సరిహద్దుల్లో చిన్న చిన్న మా ర్పులు ఉండే అవకాశాలున్నాయని పోలీస్‌శాఖలో చర్చ నడుస్తున్నది. ప్రధానంగా హైదరాబాద్, మల్కాజిగిరి కమిషనరేట్ల మధ్య బేగంపేట్, సికింద్రాబాద్ ప్రాంతాల్లోని కొన్ని పోలీస్స్టేషన్ల పరిధిలోని సరిహద్దుల్లో మార్పులు చోటు చేసుకునే అవకాశాలు లేకపోలేదని పలువురు అధికారులు మాట్లాడుకుంటున్నారు. జీహెచ్ఎంసీ విభజన పూర్తికావడం, ఆయా పరిధుల విషయంలో స్పష్టత వస్తుండడంతో ఇక పోలీస్ కమిషనరేట్ల పరిధిలోని సరిహద్దుల్లో కూడా పూర్తి స్పష్టత రానున్నది.
రాజకీయ పార్టీల నాయకులు, ప్రజాప్రతినిధులు, సామాన్య ప్రజలు కమిషనరేట్ల సరిహద్దులు మార్చాలంలూ ప్రభుత్వానికి విన్నవించినా ఏ మాత్రం పట్టించుకోవడంలేదు. సైబరాబాద్‌లో ఉన్న శంషాబాద్, రాజేంద్రనగర్, గతంలో రాచకొండలో ఉన్న ఆదిభట్ల, పహాడీషరీఫ్ ప్రాంతాలను హైదరాబాద్‌లో, హైదరాబాద్ నార్త్‌జోన్‌లో ఉన్న పలు పోలీస్స్టేషన్లను మల్కాజిగిరిలోకి కలిపారు. అప్పటి వరకు రాచకొండలో ఉన్న యాదాద్రి- భువనగిరిని వేరు చేయగా.. మహేశ్వరం జోన్‌కు ఉన్న ఔటర్ అవతలి ఠాణాలను మాత్రమే పరిమితం చేసి వాటిని ఫ్యూచర్ సిటీలో భాగం చేశారు.
ఇలా కొన్ని ప్రాంతాలను కలుపుతూ, మరికొన్ని ప్రాంతాలను విడగొట్టి కొత్తగా హైదరాబాద్, మల్కాజిగిరి, సైబరాబాద్ రూపురేఖలు మార్చి కొత్తగా ఫ్యూచర్ సిటీ కమిషనరేట్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం మార్కెట్, గోపాలపురం ఠాణాలు మల్కాజిగిరిలోకి వెళ్లాయి. ఈ ఠాణాల్లోని ప్రాంతాల్లో ఏమై నా మార్పులు రావచ్చని పోలీస్‌శాఖలో చర్చ జరుగుతోంది. ఈ విషయంపై ఉన్నతాధికారులు మాత్రం మార్పులకు సంబంధించి మాకు ఎలాంటి సమాచారం లేదని పేర్కొంటున్నారు. సరిహద్దులో ఉండే ఠాణాల్లోని ప్రాంతాల్లో చిన్న చిన్న మార్పులు ఉండే అవకాశాలు లేకపోలేదని అంటున్నారు. నాలుగు కమిషనరేట్ల పోలీసులు ఎవరి పరిధిలో వాళ్లు విధులు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే పలు కొత్త డివిజన్ల ఏర్పాటు జరిగిం ది. ఆయా డివిజన్లకు కొత్తగా ఏసీపీలను సైతం నియమించారు.
ఇంకా అక్కడక్కడ ఏసీపీల నియమాకాలు జరగాల్సి ఉంది. జీహెచ్ఎంసీ విభజనకు సంబంధించిన ప్రకటన విడుదలైతే, ఆయా కమిషనరేట్ల పరిధిలో ఏ ప్రాంతాలుంటాయి, అవి ఏ ఠాణాలోకి వస్తున్నాయనే విషయంలో మరింత స్పష్టత వ చ్చే అవకాశాలున్నాయని పోలీస్ సిబ్బంది మాట్లాడుకుంటున్నారు. కమిషనరేట్ల విభజన సక్రమంగా లేదని, ఇష్టానుసారంగా చేశారనే విమర్శలు వస్తున్నాయి. ప్రభుత్వం మొండిగా ఉంటూ జీహెచ్ఎంసీని, ఇటూ పోలీసు విభాగాలను ఎక్కడికక్కడే విడగొట్టడంతో సామాన్య ప్రజలు గుర్రుగా ఉన్నారు. ప్రజల నిరసనలను, అభిప్రాయాలను ప్రభుత్వం ఏ మాత్రం పట్టించుకోకుండా ఈ పునర్వి భజన ప్రక్రియలు పూర్తి చేసిందని సామాన్య ప్రజలు ఆందోళన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss 10 | బిగ్‌బాస్ తెలుగు 10లో ఊహించని ట్విస్ట్.. ఈ వారం నో ఎలిమినేషన్,సీక్రెట్ రూమ్‌లోకి షాలిని!
Kolkata Stampede | ‘తొక్కిసలాట ఎలా జరిగింది’.. బాధితులను పరామర్శించిన కేంద్ర హోంమంత్రి, బెంగాల్ సీఎం.. Video
The Paradise | ఓటీటీలోకి ‘ది ప్యారడైజ్’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Kolkata stampede | తొక్కిసలాట ఘటనపై రాష్ట్రపతి, ప్రధాని సంతాపం.. రూ.2 లక్షల పరిహారం ప్రకటించిన ప్రధాని
Akka Teaser | ‘అక్క’ టీజర్‌తో ఆసక్తి రేపుతున్న కీర్తి సురేశ్.. రాధికా ఆప్టేతో హోరాహోరీ పోరు!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

