వచ్చే నెల 2, 5న ఇండ్ల పంపిణీ
డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను ఉచితంగా అందజేయటం రాష్ట్రంలో తప్ప దేశంలో మరెకడా లేదని పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. శుక్రవారం తన కార్యాలయం నుంచి ఈ నెల 27న నిర్వహించిన ఆన్లైన్ డ్రాలో ఎంపికైన డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల లబ్ధిదారులతో టెలీ కాన్ఫరెన్స్ ద్వారా మంత్రి తలసాని మాట్లాడారు.
- మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్
సిటీబ్యూరో, సెప్టెంబరు 29 (నమస్తే తెలంగాణ ) : డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను ఉచితంగా అందజేయటం రాష్ట్రంలో తప్ప దేశంలో మరెకడా లేదని పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. శుక్రవారం తన కార్యాలయం నుంచి ఈ నెల 27న నిర్వహించిన ఆన్లైన్ డ్రాలో ఎంపికైన డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల లబ్ధిదారులతో టెలీ కాన్ఫరెన్స్ ద్వారా మంత్రి తలసాని మాట్లాడారు. ముందుగా లబ్ధిదారులకు మంత్రి శుభాకాంక్షలు తెలిపారు. సొంత ఇల్లు లేని పేద, మద్య తరగతి ప్రజల కలను సాకారం చేయాలనే ఆలోచనతో సీఎం కేసీఆర్ గొప్ప మనసుతో డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పంపిణీకి శ్రీకారం చుట్టారని తెలిపారు. 9600 కోట్ల రూపాయల వ్యయంతో లక్ష డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణ కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు. ఈ ఇండ్లను కూడా అత్యంత ఖరీదైన ప్రాంతాలలో నిర్మించినట్లు పేరొన్నారు.
2 బెడ్ రూమ్ లు, కిచెన్, హాల్ తో కూడిన ఇంటి నిర్మాణంతో పాటు డ్రైనేజీ, విద్యుత్, వాటర్ వంటి అన్ని సౌకర్యాలను కల్పిస్తున్నట్లు వివరించారు. ఇండ్ల పంపిణీలో రాజకీయ జోక్యం లేకుండా ర్యాండమైజేషన్ పద్ధతిలో ఆన్లైన్ డ్రా నిర్వహించి లబ్ధిదారులను ఎంపిక చేస్తున్నట్లు తెలిపారు. ఇప్పటి వరకు నిర్మించిన ఇండ్లలో మొదటి విడతలో 11,700 మంది అర్హులకు పంపిణీ చేయగా, రెండో విడతలో 13,200 మందికి పంపిణీ చేసినట్లు చెప్పారు. 3వ విడతలో 36,884 లబ్ధిదారుల ఎంపిక చేశామని, వీరికి అక్టోబర్ 2, 5 తేదీలలో ఇండ్లను పంపిణీ చేస్తామని మంత్రి తలసాని వెల్లడించారు. ఆయా తేదీలలో ఎకడ ఇండ్లను పంపిణీ చేస్తారో అకడికి మిమ్మల్ని తీసుకెళ్లడానికి చేస్తున్న ఏర్పాట్లపై మున్సిపల్, రెవెన్యు అధికారులు మీకు తెలియజేస్తారని మంత్రి లబ్ధిదారులకు వివరించారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

