Punjagutta | హైదరాబాద్ : పంజాగుట్టలో అధునాతన సదుపాయాలతో నిర్మిస్తున్న స్మశాన వాటిక అభివృద్ధి పనులను మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎమ్మెల్యే దానం నాగేందర్, జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, కార్పొరేటర్ మన్నె కవిత శుక్రవారం ఉదయం పరిశీలించారు. మనిషి చివరి మజిలీ ప్రశాంతంగా ముగియాలన్న అనే ఆలోచనతో స్మశాన వాటికల అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ స్మశాన వాటికను రూ. 5 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్నారు. ఈ నెల 25న ప్రారంభించనున్నట్లు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రకటించారు.
ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించే విధంగా సుందరీకరణ, పచ్చదనాన్ని పెంపొందించేలా మొక్కల పెంపకం, రోడ్లు, ప్రహారీగోడల నిర్మాణం, అస్తికలను భద్రపరిచేలా లాకర్ల ఏర్పాటు తదితర అన్ని సౌకర్యాలతో పంజాగుట్ట హిందూ స్మశాన వాటిక అభివృద్ధి పనులు జరిగాయి.