బేగంపేట్/ బన్సీలాల్‌పేట్, అక్టోబర్ 27: ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమంటూ తన ప్రచారాన్ని మరింత ముమ్మరం చేశారు. సనత్‌నగర్ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి తలసాని శ్రీనివాస్‌యాదవ్. ఇప్పటి వరకు చేపట్టిన ప్రభుత్వ పథకాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకువెలుతూ సనత్‌నగర్ నియోజకరవ్గం లో తన ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. తలసాని శ్రీనివాస్‌యాదవ్‌కు స్థానిక ప్రజలు అడుగడుగున సాదరంగా ఆహ్వానిస్తూ శ్రీనన్న మీకు మేము అండగా ఉన్నాం మంటూ అన్ని వర్గాల ప్రజల నుంచి మంచి స్పందన లభిస్తుంది. ఈ నెల 19న తలసాని శ్రీనివాస్‌యాదవ్ ఇంటింటా ప్రచారం ప్రారంభించి ఒక్కో రోజు ఓక్కో డివిజన్లో పర్యటిస్తున్నారు. ఇప్పటి వరకు చేసిన అభివృద్ధి వివరిస్తూ ప్రచారంలో దూసుకుపోతున్నారు.
సనత్‌నగర్ నియోజకవర్గంలో ఎన్నికల షెడ్యూల్ విడుదలైప్పటి నుంచి ఇప్పటి వరకు బీజేపీ నాయకులు జాడే కనిపించడం లేదు. ఆపార్టీకి సంబంధించిన నాయకులు ఎక్కడ కూడా ప్రజలతో మమేకమైనటువంటి దాఖలాలు లేకపోవడంతో కార్యకర్తలు ఆయోమయంలో పడ్డారు. పార్టీ అధిష్టానం సనత్‌నగర్ నియోజకరవ్గం నుంచి మాజీ ఎమ్మెల్యే మర్రి శశిధర్‌రెడ్డికి అసెంబ్లీ టిక్కెట్ కేటాయిస్తారనే ఊహాగానాలే తప్పా ఇప్పటి వరకు ఏవరనేది స్పష్టత లేకపోవడంతో నియోజకవర్గంలో నడిపించే నాయకులే కరువయ్యారు. ఎన్నికల షెడ్యూల్డ్‌కు ముందు అప్పుడప్పుడు డివిజన్లో అక్కడక్కడ జరిగిన చిన్న చిన్న సమావేశాల్లో పాల్గొన్న మర్రి శశిధర్‌రెడ్డి షెడ్యూల్డ్ వె లుబడిన అనంతరం నియోజకవర్గంలో కనిపించిన దాఖలాలు లేవు. దీంతో కార్యకర్తల్లో ఆందోళన మెదలైనట్టు తెలిసింది.
సనత్‌నగర్ నియోజవకర్గంలో స్థానిక అభ్యర్థులకు అసెంబ్లీ టిక్కెట్ కేటాయించకపోవడంతో స్థానిక నాయకులు కార్యకర్తలు తీవ్ర అసంతృప్తిగ ఉన్నట్టు తెలిసింది. ఇప్పటి వరకు నియోజకవర్గం నాయకులకు, కార్యకర్తలకు స్థానిక ప్రజలకు పరిచయం లేని అభ్యర్థి కోటా నీలిమకి కాంగ్రెస్ పార్టీ నుంచి టిక్కెట్ కేటాయించిన విషయం తెలిసిందే. దీంతో ఆమె వెంట ప్రచారానికి రావడానికి కూడా కొందరు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారని గుసగుసలు వినబడుతున్నాయి. గతంలో కాంగ్రెస్ పార్టీ నుంచి గెలుపొందిన వ్యక్తులు నియోజకవర్గం ప్రజల అభివృద్ధిని పట్టించుకున్న దాఖలాలు లేకపోవడంతో ఇప్పుడు కొత్తగా వచ్చిన సూదరపు వ్యక్తులు ఇంకేం చేస్తారనే అనుమానాలు కార్యకర్తల్లో వ్యక్తమవుతున్నాయి. దీంతో పాటు నాయకుల ప్రచారానికి కూడా స్పందన ఎక్కడా కనిపించడం లేదు.
ఎల్లప్పుడు అందుబాటులో ఉంటానని, ఎలాంటి సమస్య ఉన్నా అండగా ఉండి పరిష్కరిస్తానని సనత్‌నగర్ బీఆర్ఎస్ అభ్యర్థి, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. శుక్రవారం బన్సీలాల్‌పేట్ డివిజన్లోని భోలక్‌పూర్ ప్రాంత బస్తీలలో ఆయన ఇంటింటి ప్రచారం నిర్వహించారు. మాజీ కార్పొరేటర్ ఏసూరి సావిత్రి మహేశ్ ఆధ్వర్యంలో జరిగిన పాదయాత్రలో అడుగడుగునా బస్తీలలో ఆయనకు మహిళలు మంగళహారతులతో ఘనంగా స్వాగతం పలికారు. తిలకం దిద్ది ఆశీర్వదించారు. అరుంధతీయ సంఘం, బాపూజజీ యువజన సంఘం, బాబు జగ్జీవన్‌రామ్ సంక్షేమ సంఘం, అశోకా యువజన సం ఘం, హరిజన బస్తీలలో ఆయన ఇంటింటికీ వెళ్లి ఓటర్లను కలిసి పలకరించారు. కారు గుర్తుకే ఓటు వేయాలని అభ్యర్థించారు. అనంతరం మేకలమండి ప్రభుత్వ పాఠశాల వద్ద ప్రజలతో మాట్లాడారు.
భోలక్‌పూర్ ప్రాంతంతో తనకు ఎంతో అనుబంధం ఉన్నదని తెలిపారు. త్వర లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి, పోలీస్ స్టేన్‌కు కనెక్ట్ చేసి పోకిరీల బెడద అరికడతామని తెలిపారు. మ్యానిఫెస్టోలో ప్రకటించిన విధంగా గ్యాస్ సిలిండర్‌ను రూ.4వందలకే అందిస్తామ ని, రేషన్ సన్న బియ్యం పంపిణీ, ఆడపిల్ల పెండ్లి కి రూ.2 లక్షల ఆర్థిక సహాయం, ఆరోగ్యశ్రీ పథ కం ద్వారా రూ.15 లక్షల వరకు వైద్య సేవలు పొందవచ్చని చెప్పారు. అర్హులైన వారికి దళితబంధు పథకం, ఇంటి నిర్మాణం కోసం గృహలక్ష్మి పథకం ద్వారా ఆర్థిక సహాయం అందిస్తామని చెప్పారు. నగరంలో మరో లక్ష డబుల్బెడ్రూమ్ ఇండ్ల నిర్మాణం చేపట్టి సొంత ఇల్లు లేని వారందరికీ అందజేస్తామని తెలిపారు. పేదల కోసం గాంధీ దవాఖానలో ఇప్పుడు సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు లభిస్తున్నాయని అన్నారు.
మేకలమండి ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల తల్లిదండ్రులు మంత్రి తలసానికి స్వచ్చందంగా మద్దతు ఇస్తామని తరలివచ్చారు. ఈ కార్యక్రమంలో బన్సీలాల్‌పేట్ కార్పొరేటర్ కే హేమలత, మాజీ కార్పొరేటర్ ఏసూరి సావిత్రి, బీఆర్ఎస్ ఇన్చార్జీ జీ పవన్‌కుమార్‌గౌడ్, ఏసూరి మహేశ్వరరావు, కే లక్ష్మిపతి, డివిజన్ అధ్యక్షుడు వెంకటేశన్రాజు, కార్యదర్శులు ఎం. మహేందర్, రాజేందర్, వెంకట్, భోలక్‌పూర్ వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షుడు మారుతి, కార్యదర్శి బాబు, సలహాదారుడు టి. శ్రీనివాస్‌యాదవ్, సభ్యులు నాగరాజు, హనుమంత్, సురేశ్, మహేందర్, శివకుమార్, శ్రీకాంత్‌రెడ్డి, జనార్దన్, శ్రీరాములు, రాజేంద్రప్రసాద్, శ్రీనివాస్, నాగలక్ష్మి, శోభారాణి, లక్ష్మి, లావణ్య, అమృత, అంబిక, అనితారెడ్డి పాల్గొన్నారు.