ఆశీర్వదించండి.. అండగా ఉంటా
తొమ్మిదేండ్లలో బన్సీలాల్‌పేట్ డివిజన్ రూపురేఖలు మారిపోయాయని, అద్భుతమైన అభివృద్ధి జరిగిందని, అన్ని వర్గాల పేదలకు సంక్షేమ ఫలాలు అందించామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు.
బన్సీలాల్‌పేట్, అక్టోబర్ 26 : తొమ్మిదేండ్లలో బన్సీలాల్‌పేట్ డివిజన్ రూపురేఖలు మారిపోయాయని, అద్భుతమైన అభివృద్ధి జరిగిందని, అన్ని వర్గాల పేదలకు సంక్షేమ ఫలాలు అందించామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. గురువారం బన్సీలాల్‌పేట్ డివిజన్లోని న్యూబోయిగూడలోని గొల్లకొమరయ్య కాలనీ, గాంధీనగర్ కాలనీ, సీసీ నగర్ ఫేజ్-2, బర్కాల బస్తీ, రామస్వామి కాంపౌండ్ బస్తీలలో ఆయన ఇంటింటి ప్ర చారం నిర్వహించారు. అడుగడుగునా బస్తీలలో ఆయనకు మహిళలు మంగళహారతులతో ఘనంగా స్వాగతం పలికారు. గొల్లకొమరయ్య కాలనీలో అధ్యక్షుడు కేఎమ్. కృష్ణ, కార్యదర్శి నర్సింగ్‌రావు, వినోద్, మనీశ్ పూలతో తయారు చేసిన విల్లు, బాణం, గదలను మంత్రికి అందజేశారు. అనంతరం ఆయన గాంధీనగర్ కాలనీ ప్రధాన రహదారిలో డివిజన్ ఎన్నికల కార్యాలయాన్ని అయన కార్పొరేటర్ కే హేమలత, కే లక్ష్మిపతి, బీఆర్ఎస్ సికింద్రాబాద్ పార్లమెంట్ ఇన్చార్జి తలసాని సాయికిరణ్ యాద వ్, బీఆర్ఎస్ ఇన్చార్జి జీ పవన్‌కుమార్ గౌడ్లతో కలిసి ఆయన ప్రారంభించారు.

ఈ సందర్భంగా పలువురు బీజేపీ కార్యకర్తలు వెంకన్న, రాధేశ్యామ్, ప్రదీప్, రవికుమార్, సత్యనారాయణ, శ్రీనివాస్‌లకు గులాబీ కండువా కప్పి బీఆర్ఎస్ పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా పేదల కోసం మల్టీపర్పస్ ఫంక్షన్ హాలు నిర్మాణం, ఐడీహెచ్ కాలనీ, జీవైఆర్, పీఎస్ నగర్, బీఎం నగర్, సీసీ నగర్లలో డబుల్ బెడ్రూమ్ ఇండ్ల కాలనీ నిర్మాణాలే ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ అని ఆయన అన్నారు. రోడ్లు, పార్కులు, కమ్యూనిటీ హాళ్లు, తాగునీటి, సీవరేజీ పైపులైన్లు ఏర్పాటు చేశామన్నారు. రామస్వామి కాం పౌండ్ బస్తీ వాసులకు తాను అండగా ఉంటానని మంత్రి తలసాని అన్నారు.
బస్తీ స్థల సమస్యపై తనకు పూర్తి అవగాహన ఉందన్నారు. బస్తీవాసులు ఆందోళన చెందవద్దని, ఎలాంటి సమస్య వచ్చినా తన దృష్టికి తీసుకురావాలని కోరారు. పాత ఇండ్ల నిర్మాణం కోసం గృహలక్ష్మి పథకం ద్వారా ఆర్థిక సహాయం అందిస్తామని చెప్పారు. నాలుగు వందలకే గ్యాస్ సిలిండర్‌ను అందిస్తామని, వృద్ధులకు, వితంతువులకు ఇచ్చే ఫించన్ కూడా రూ. మూడు వేలకు పెంచుతున్నామని, ఆరోగ్యశ్రీ ద్వారా రూ. 15 లక్షల వరకు వైద్య సేవలు పొందే అవకాశం కల్పిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు కే లక్ష్మిపతి, అరుణ్గౌడ్, ప్రేమ్‌కుమార్, దేశపాక శ్రీను, కమల్‌కుమార్, రాజేందర్, జ్ఞాని, రజాక్, ఫహీమ్, అబ్బాస్, చాంద్, విజయ్‌శంకర్, కేఎమ్.కృష్ణ, శ్రీనివాస్, చిన్నా, నాగభూశణం, నరేశ్, శ్రీలక్ష్మి, విజయ, సీమ తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
467 సీసీ టీవీ కెమెరాలతో పటిష్టమైన నిఘా వ్యవస్థ : ఎస్పీ రోహిత్ రాజు
Madhu Kambikar | చిత్రసీమలో మరో విషాదం.. పటేకర్ ‘రీల్ అమ్మ’ కన్నుమూత..!
‘ఎండిపోయిన పంటలకు ఎకరాకు రూ.30 వేల నష్ట పరిహారం చెల్లించాలి’
Gang Rape Survivor’s Father Killed | అత్యాచారం కేసు వెనక్కి తీసుకునేందుకు నిరాకరణ.. బాధితురాలి తండ్రిని హత్య చేసిన నిందితులు
Terrific Incident | ఘోర ప్రమాదం.. ఈవీ కారులో మంటలు చెలరేగి నలుగురు సజీవ దహనం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

