కంటోన్మెంట్/మారేడ్‌పల్లి/బొల్లారం, జూలై 17: డప్పుల దరువుకు అనుగుణంగా విన్యాసాలు.. శివసత్తులు పూనకాలు.. తొట్టెల, ఫలహారపు బండ్ల ఊరేగింపు, బోనాల ఉత్సవాలు సోమవారం మారేడ్‌పల్లి మైసమ్మ ఆలయంలో కన్నుల పండువగా జరిగాయి. ఆలయ నిర్వాహకులు చిర్రబోయిన సి. కృష్ణయాదవ్, తిరుమల వంశీ ఆధ్వర్యంలో జరిగిన బోనాల ఉత్సవాలకు మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్, సికింద్రాబాద్ పార్లమెంట్ బీఆర్ఎస్ ఇన్చార్జి తలసాని సాయికిరణ్‌యాదవ్, మల్కాజ్గిరి పార్లమెంట్, కంటోన్మెంట్ బీఆర్ఎస్ ఇన్చార్జి మర్రి రాజశేఖర్‌రెడ్డి, కార్పొరేషన్ చైర్మన్లు గజ్జెల నాగేశ్, మన్నె క్రిశాంక్, కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యాక్షుడు జక్కుల మహేశ్వర్‌రెడ్డి పాల్గొని అమ్మవారికి పూజలు నిర్వహించారు. ఆలయ నిర్వాహకుడు కృష్ణయాదవ్ పలువురినీ శాలువతో సత్కరించారు. ఫలహారపు బండ్ల ఊరేగింపు మారేడ్‌పల్లి లోని పురవీధుల్లో జరిగింది. వివిధ జిల్లాల నుంచి వచ్చిన కళాకారులు ఆట, పాటలు, నృత్యాలతో ఆకట్టుకున్నారు. ఎలాంటి అవాంచనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. బాపూజీనగర్, తాడ్బంద్ తదితర ప్రాంతాల్లో తొట్టెలు, ఫలహార బండ్ల ఊరేగింపులో బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు శ్రీ గణేశ్ పాల్గొని పూజలు చేశారు.
కంటోన్మెంట్ రెండవ వార్డు ఇందిరమ్మనగర్ లోని బీరప్ప ఆలయంలో అమావాస్యను పురస్కరించుకొని సోమవారం అన్నదాన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా తెలంగాణ రాష్ట్ర బే వరేజెస్ కార్పొరేషన్ చైర్మన్ గజ్జెల నాగేశ్ ముఖ్యఅతిథిగా హాజరై ఆలయంలో బీరప్ప స్వామికి పూజలు నిర్వహించిన అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. స్వామి వారి అనుగ్రహంతో ఆలయం వద్ద సంవత్సర కాలంగా అమావాస్య రోజున అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని ఇక మీదట కూడా కార్యక్రమం కొనసాగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, బీఆర్ఎస్ పార్టీ నాయ కులు పాల్గొన్నారు.
అమావాస్యను పురస్కరించుకొని బాపూజీ నగర్లో ని శ్రీ దేవి నల్ల పోచమ్మ అమ్మవారి ఆలయ కమిటీ ఆధ్వర్యంలో సోమవారం అన్నదాన కార్యక్రమం నిర్వహిం చారు. ఆలయ ఫౌండర్ చైర్మన్, బోర్డు మాజీ ఉపాధ్యాక్షుడు జంపన ప్రతాప్ ముఖ్యఅతిథిగా హాజరై మ్మవారికి పూజలు నిర్వహించి అనంతరం అన్నదాన కార్యక్రమా న్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో అజిత్, ప్రేమ్ ముదిరాజ్, దుర్గయ్య, పుట్టి నరసింహ, రామారావు, నరేందర్, జహంగీర్, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.
సీతారాంపూర్‌లోని ముత్యాలమ్మ ఆలయంలో సోమవారం బోనాల ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా మల్కాజ్గిరి పార్లమెంట్, కంటోన్మెంట్ బీఆర్ఎస్ ఇన్చార్జి మర్రి రాజశేఖర్‌రెడ్డి, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు శ్రీ గణేశ్, ముప్పిడి మధుకర్, బోర్డు మాజీ సభ్యుడు పాండుయాదవ్ అమ్మవారికి పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ఆవరణలో ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని బీఆర్ఎస్ నాయకులు మర్రి రాజశేఖర్‌రెడ్డి, శ్రీ గణేశ్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీకాంత్, కిశోర్, రాజాసింగ్, సురేశ్, అశోక్ తదితరులు పాల్గొన్నారు.
కంటోన్మెంట్ బొల్లారం సదర్బజార్లోని శ్రీ మహంకాళి ఆలయంలో బోనాల ఉత్సవాల సందర్భంగా బోయిన్‌పల్లికి చెందిన ప్రముఖ వ్యాపార వేత్త ఎన్.వి. పృథ్వీనాథ్ సోమవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ… ఆలయ అభివృద్ధికి ఎల్లప్పుడూ కృషి చేస్తానని చెప్పారు. అనంతరం ఆయల కమిటీ సభ్యులు పృథ్వినాథ్ను ఘనంగా సత్కరించారు. బోర్డు సీఈఓ మధుకర్ నాయక్, బోర్డు మాజీ ఉపాధ్యాక్షుడు జయప్రకాశ్ తదతరులు పాల్గొన్నారు.
కంటోన్మెంట్ ఏడో వార్డు తిరుమలగిరి జేఎన్ఎన్యూఆర్ఎమ్ కాలనీలో సోమవారం రాష్ట్ర మినరల్ డెవలప్మెంట్ చైర్మన్ మన్నె క్రిషాంక్ నల్లపోచమ్మ ఆలయంలో అమ్మవారిని దర్శించుకొని పూజలు చేశారు.ఈ కార్యక్రమంలో బోర్డు మాజీ సభ్యుడు శ్యామ్ కుమార్, యశ్వంత్ కుమార్, రాజారెడ్డి, మోహన్, సునీత, రాజు తదితరులు పాల్గొన్నారు.