Minister Srinivas Yadav | ప్రజల ఆరోగ్య సంరక్షణకు ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తుందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. గోషామహల్ నియోజకవర్గ పరిధిలోని గన్ ఫౌండ్రీ, జాంబాగ్ డివిజన్లో బస్తీ దవాఖానలను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదలకు ప్రభుత్వ వైద్య సేవలు మరింత అందుబాటులోకి తీసుకొచ్చేందుకే బస్తీ దవాఖానలు ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందన్నారు.
ఉచితంగా వైద్య పరీక్షలు, మందుల పంపిణీ చేయడం జరుగుతుందని, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో వందల కోట్ల వ్యయంతో ప్రభుత్వ ఆసుపత్రులను అభివృద్ధి జరిగిందన్నారు. ప్రజలపై ఆర్థికభారం పడకుండా ఆదుకోవాలనేది ప్రభుత్వ ఆలోచన అన్నారు. అత్యాధునిక వైద్య పరికరాలు అందుబాటులో ఉన్నాయని, అన్ని రకాల వైద్య పరీక్షలు ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉచితంగా సేవలందిస్తున్నామన్నారు.